తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సామాజిక వర్గాల అంశం అనేది అత్యంత సున్నితం. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల మధ్య పోరు రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులో కమ్మ కాపు.. సామాజిక వర్గాల మధ్య పోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాపు సామాజిక వర్గంలో దైవంగా కొలిచే వంగవీటి రంగా హత్య కేసు విషయంలో తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను దోషిగా చూపించడంలో అప్పట్లో కొందరు నాయకులు విజయవంతమయ్యారు. ఇక అప్పటినుంచి ఆ పార్టీని కాపు సామాజిక వర్గం టార్గెట్ చేస్తూ ఉంటుంది.
Also Read : మాతో మీకు పోలికేంటి..? బెంగళూరుకు పెమ్మసాని కౌంటర్
గతంలో టిడిపి ఓటమికి ఇది కూడా ఒకరకంగా కారణమే. 2019 ఎన్నికల్లో రంగా హత్య కేసు కు సంబంధించి అనేక వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చారు వైసిపి అనుకూల మీడియా జర్నలిస్టులు. ఇక ఇప్పుడు మళ్లీ ఇదే తరహాలో కాపు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గాన్ని ఈ మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన ఘటన విషయంలో వైసీపీ అనుకూల మీడియా, అలాగే అక్కడి నాయకులు అనుసరించిన వైఖరి వివాదాస్పదమైంది.
Also Read : అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్ యూరప్, గల్ఫ్..!
వంగవీటి రంగా అభిమానులపై కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కారుతో దూసుకు వెళ్లారని గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని గొడవలను అదుపులోకి తీసుకువచ్చిన పరిస్థితి. ఇక ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ తో సోషల్ మీడియాలో.. కొందరు వైసీపీ కార్యకర్తలు కమ్మ, కాపు సామాజిక వర్గాలకు గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శిరీష వంగవీటి కాపు అనే పేరుతో ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ లో కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రొఫైల్ పై టిడిపి కార్యకర్తలు విచారణ చేయగా.. అసలు పేరు షేక్ సుల్తానా అని ఉంది. ఈ ప్రొఫైల్ నుంచి వస్తున్న పోస్టులన్నీ కమ్మ, కాపు సామాజిక వర్గానికి మధ్య గొడవలు సృష్టించే విధంగానే ఉన్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. దీనితో ఈ తరహా గొడవలు పెట్టే ప్రొఫైల్స్ పై టీడీపీ కార్యకర్తలు దృష్టి పెట్టారు. వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.