Saturday, September 13, 2025 09:41 PM
Saturday, September 13, 2025 09:41 PM
roots

అదే నిజమైతే.. 16 నెలల సంగతి ఏంటీ..?

జగన్‌ను జైలుకు పంపాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.. చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నాడు కాబట్టి.. జగన్‌ను ఒక్కరోజు అయినా సరే ఎక్కువగా జైలులో ఉంచాలనేది టీడీపీ నేతల టార్గెట్.. అందుకే జగన్ ‌మీద కక్ష కట్టారు. లేని పోని కేసులన్నీ పెట్టేస్తున్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు.. వైసీపీలో కీలక నేతలే ఈ మాట అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో వేల కోట్ల చేతులు మారాయని టీడీపీ, జనసేన నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. విచారణ కోసం సీఐడీలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విచారణలో దూకుడు పెంచిన సీఐడీ.. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి వంటి జగన్‌కు అత్యంత ఆప్తులను అరెస్టు చేసింది.

Also Read : సెన్సేషన్ క్రియేట్ చేసిన రెడ్డప్పగారి మాధవి.. ఇది కడప పౌరుషం అంటే..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఓఎస్‍‌డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. జగన్ వ్యవహారాలు అన్నీ వీళ్లిద్దరే నడిపించారు. ముఖ్యమంత్రితో ఏదైనా పని ఉంటే.. ధనుంజయ్ రెడ్డికి చెబితే చాలు.. ఆయన ఓకే అంటే.. అది ఏ స్థాయి పని అయినా సరే అయిపోతుంది. అంతే తప్ప అధినేత దర్శనం మాత్రం జరగదు. ఆ స్థాయిలో ఈ అధికారులిద్దరు సీఎంఓలో చక్రం తిప్పారు. అలాంటి వారిని ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది. దీంతో వీళ్లిద్దరు ఏ విషయాలు బయట పెడతారో అని వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. వాస్తవానికి ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించింది. అయితే ఎక్కడా డిజిటల్ పేమెంట్ ఏర్పాటు చేయలేదు. క్యాష్ అండ్ క్యారీ విధానమే అమలు చేశారు. పైగా ఊరు పేరు బ్రాండ్లను ప్రజలకు అమ్మేశారు. దీని వల్ల వేల కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయనే ఆరోపణలున్నాయి.

Also Read : వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ ఢిల్లీ టూర్.. సడన్ టూర్ అందుకేనా..?

లిక్కర్ స్కామ్‌లో మొదటి నుంచి అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఆదాయం మొత్తం ప్రతిరోజు వివిధ మార్గాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందని టీడీపీ నేతలు తొలి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప అరెస్టు తర్వాత అందరి దృష్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిపై పడింది. భారతీ సిమెంట్ సంస్థలో గోవిందప్ప లైఫ్ టైమ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారతీకి గోవిందప్ప అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్నారనే మాట అందరికీ తెలిసిన విషయమే. గోవిందప్ప అరెస్టు తర్వాత తర్వాత భారతీ రెడ్డికి సమన్లు జారీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సీఐడీ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ జగన్ అనేది అందరూ భావిస్తున్నారు.

Also Read : వంశీకి వైసీపీ మద్దతు ఎక్కడ..? రజనీ కోసం రంగంలోకి పార్టీ అధిష్టానం..!

లిక్కర్ స్కామ్‌ కేసులో సీఐడీ అరెస్టుల పర్వం కొనసాగుతుండగా.. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వమే మద్యం అమ్మితే అవినీతి ఎలా జరిగింది అని వాదిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పని చేస్తున్నారని.. కనీసం 54 రోజులైనా సరే జగన్‌ను జైలులో ఉంచారని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే.. మరి గతంలో ఏకంగా 16 నెలలు జైలులోనే గడిపిన జగన్.. తన రికార్డును ఇప్పటి వరకు ఏపీలో ఏ పొలిటిషన్ బ్రేక్ చేయలేదు కదా అనే ప్రశ్నకు మాత్రం వైసీపీ నేతలు సైలెంట్‌ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్