2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. బ్లూ మీడియా కూడా పదే పదే చంద్రబాబును టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసింది. తీరా సీన్ చూస్తే… అసలు హత్యకు కర్త, కర్మ, క్రియ మొత్తం… బ్లూ బ్యాచ్ అనే క్లారిటీ జనాలకు వచ్చింది. కడప ఎంపీని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కాపాడాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది అనే ఆరోపణలు ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటాయి.
Also Read : మరో మాజీకి ఝలక్ ఇచ్చిన జగన్…!
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత చంచల్ గూడ జైలుకు వెళ్ళేది కడప ఎంపీనే అనే వార్తలు కూడా అప్పట్లో బాగానే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఏ పరిణామాలు ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అక్క షర్మిల… కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటాలు చేస్తుంటే… సునీత మాత్రం ఎస్పీలను, మంత్రులను, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై నిందితులు ప్రైవేట్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
Also Read : కొత్త పెన్షన్ల అర్హతలు… కావాల్సిన పత్రాలు ఇవే
ఈ నేపధ్యంలో వివేకా పిఏ కృష్ణా రెడ్డిని పోలీసులు విచారించారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం వైఎస్ సునీత అమరావతిలో ప్రత్యక్షం అయ్యారు. ఆమె చంద్రబాబుని ఎందుకు కలిసారు ఏంటీ అనేది పక్కన పెడితే… ఈ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ఆమె సేకరించినట్టే కనపడుతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే కీలక అరెస్ట్ లు కూడా ఉండే ఛాన్స్… సునీత దూకుడు చూస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. మరి భవిష్యత్తులో ఆమె వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలియాలి అని మరికొన్ని రోజులు ఆగాల్సిందే.