ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ కంటే వేగంగా ఆమె పర్యటనలు ఉండటం చూసి అటు వైసీపీ నాయకులతో పాటుగా ఇటు కూటమి పార్టీలు కూడా షాక్ అవుతున్నాయి. షర్మిల ఈ మధ్య కాలంలో చేసిన పర్యటనలు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. విజయవాడ వరదల విషయంలో షర్మిల చాలా వేగంగా స్పందించారు. బాధితులను పరామర్శించడానికి వరద నీళ్ళల్లో కూడా షర్మిల వెళ్ళారు.
ఇక కాకినాడ జిల్లాలో వచ్చిన వరదల సమయంలో జగన్ కంటే ముందే వెళ్ళారు. అక్కడికి వెళ్లి బాధితులతో షర్మిల మాట్లాడారు. ఆ తర్వాత తప్పక జగన్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ వరదల్లో కూడా దాదాపు అదే జరిగింది. ఇక ఇప్పుడు విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన విషయంలో కూడా షర్మిల రోడ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఇదే సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని యాజమాన్యం నుంచి వచ్చిన ప్రకటన సంచలనం అయింది.
Read Also : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని షర్మిల చెప్పారు. ఇక సోషల్ మీడియాలో కూడా షర్మిల చాలా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేయడం ద్వారా… ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అటు వైపు వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక పార్టీ పదవుల విషయంలో కూడా షర్మిల పక్కా లెక్కలతో ఉంటున్నారు. వేగంగా ఖాళీ ఉన్న పదవులను పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని షర్మిల భావిస్తున్నారు. ఇలా అన్ని విదాలుగా షర్మిల ఫుల్ స్వింగ్ లో ఉండటం చూసి జగన్ షాక్ అవుతున్నారు.




