కొమ్మలు ఎప్పుడు విరుగుతాయో తెలియదు, తుఫాన్ ఏ రూపంలో వస్తుందో తెలియదు, భారీ వృక్షాలు చాలా దూరంగా ఉన్నాయి, కాపాడుతుంది అనుకున్న ఓ మహా వృక్షం… తుఫాన్ దెబ్బలు తట్టుకుని ఇప్పుడే నిలబడుతోంది… తనను తాను రక్షించుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది. తాను ఉన్నానని చెప్పేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుని ముందుకు వెళ్తోంది. ఏ వైపు నుంచి ఆ చెట్టు నిలబడటానికి అవకాశం కనపడటం లేదు. ఇది కొంచెం ఏపీలో 11 సీట్లు ఉన్న వైసీపీకి సింక్ అయ్యేలా ఏమైనా కనపడుతోందా…? సరిగా ఆలోచించండి సింక్ అవుతుంది.
ఎప్పుడు ఏ నాయకుడు బైబై అన్న అంటాడో తెలియదు… కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో అర్ధం కావడం లేదు. ఇప్పుడు పేలిన ప్రసాదం బాంబు తరహాలో. తాను చాలా బలంగా ఉన్నా అనుకుని రెచ్చిపోయి… వేధించిన టీడీపీ, జనసేన తాము చేయాల్సింది చేస్తున్నాయి. కాపాడే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు… కొన్ని మరకలు తనకు రాసుకోవాలని భావించడం లేదు. లడ్డూ వివాదంలో జగన్ సర్కార్ అప్పుడు తప్పు చేసిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ను కాంగ్రెస్ ఆదరిస్తే… కాశ్మీర్ లో కొందరికి సపోర్ట్ చేసినట్టే ఉంటుంది.
Read Aslo : బోల్తా కొట్టిన బీఆర్ఎస్ పెద్దలు
అందుకే క్రమంగా బలపడే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ దూరంగా ఉండేందుకే కష్టపడుతోంది. బిజెపి ఇప్పుడు చంద్రబాబుకి ఎదురు వెళ్ళే వాతావరణం అయితే లేదు. రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటే ఏమైనా చిందులు వేసే ఛాన్స్ ఉండేది గాని ఇప్పుడు అయితే అలాంటి సీన్ కనపడటం లేదు. జగన్ బిజేపిని దగ్గర చేసుకోవడానికి రాజ్యసభ అభ్యర్థులను ఎరవేసినా అంత సీన్ అయితే కనపడటం లేదు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేసారు. కాబట్టి ఆ విధంగా కూడా మార్గం లేదు.
ఇప్పుడు జగన్ తో ఎవరు సావాసం చేసినా హిందూ ఓటు బ్యాంకు బలంగా కోల్పోయినట్టే. నేషనల్ మీడియాలో అప్పుడప్పుడు కనపడే ఏపీ… ఇప్పుడు లడ్డూ దెబ్బకు పలు రాష్ట్రాల స్థానిక పేపర్లలో ఫస్ట్ పేజీ అవుతోంది. కాబట్టి జగన్ ఏ రకంగా ప్రయత్నం చేసినా సరే అనుకూల వాతావరణం అయితే క్రియేట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఒకప్పుడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే జగన్ కు కాస్తో కూస్తో సినిమా అర్ధమవుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు. రాబోయే రోజుల్లో కఠినంగానే జగన్ కు రోజులు గడుస్తాయి అనేది మాత్రం పక్కా.