ప్రసాదం టిష్యూతో పట్టుకుని వాసన చూసి పడేయడం, దేశంలో రాష్ట్రపతులు, శక్తివంతమైన నాయకులు వచ్చి దేవుడిపై విశ్వాసం ఉంది అందుకే దర్శించుకుంటున్నాం అని సంతకాలు చేసినా ఒకరు చేయకపోవడం, ఇంట్లో గుడి సెట్ వేయించుకోవడం వంటి చేష్టలు గత 10 ఏళ్ళుగా ప్రజలు చాలానే చూస్తూ ఉన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు చేయడం, కొండపై రాజకీయాలు మాట్లాడటం వంటి వికృత చేష్టలకు పాల్పడటం, భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించడం వంటివి చాలానే చూసారు ప్రజలు. తిరుమల కొండ పై రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నా దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు.
ఇప్పుడు ప్రభుత్వంతో పాటుగా రోజులు కూడా మారాయి. గతంలో నాయకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 320 రూపాయలకు ఆవు నెయ్యి ఎలా వచ్చిందో ఇప్పటి వరకు నెయ్యి పంపించిన వాళ్ళు గాని, కొన్న వాళ్ళు గాని సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దేవుడి దగ్గర నువ్వు రాజకీయం చేస్తే మాకు ఏం చేయాలో తెలుసు అని కూటమి సర్కార్ జరిగిన అక్రమాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టింది. ఇప్పటి వరకు దర్శనం చేసుకోడానికి వెళ్ళేటప్పుడు సంతకం చేయని వ్యక్తి ఇప్పుడు సంతకం చేసి పైకి వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఎందుకు సంతకం చేయాలి, ఎవరి కోసం సంతకం చేయాలి.. ఎవడమ్మ మొగుడిది ఈ కొండ అని ప్రశ్నించిన వాళ్ళే అన్నీ మూసుకుని సంతకం చేయాల్సిన పరిస్థితి రావడం కొసమెరుపు.
Read Also : బెజవాడ వరద బాధితులకు బాబు రికార్డు స్పీడ్ సాయం
ఎప్పుడూ కాలి నడకన వెళ్ళని వాడు ఇప్పుడు కాలి నడకన కొండపైకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడి ప్రసాదం తినని వాడు ఖచ్చితంగా కొండ పైకి వెళ్లి తినాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రజల ముందు పబ్లిసిటీ కోసం అన్న ప్రసాదం తిన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇది ఖచ్చితంగా కలియుగ దైవం మాయ అంటున్నారు జనాలు. రాజకీయాలకు దేవుడికి సంబంధం ఉండదు, కాని దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు, కక్కుర్తి పనులు చేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉంది. కలియుగ దైవంతో పెట్టుకున్న ఎవరూ బాగు పడ్డట్లు చరిత్రలో లేదు. అందుకే రాజకీయ నాయకులు.. దేవుళ్ళతో గేమ్స్ ఆడటం వారికే మంచిది కాదు.