ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతుంటే వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రం రాజకీయపరమైన ఆరోపణలు చేస్తూ తిరుమలలో గురువారం సాయంత్రం సందడి చేశారు. బాధితులను పరామర్శించడం కోసం తిరుమల వెళ్ళిన ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు కాస్త కామెడీగా ఉన్నాయి. చిత్తూరు. తిరుపతి జిల్లాల పోలీసులను చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నియోజకవర్గానికి పంపించారని, తిరుపతిలోని వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ కేంద్రాల వద్ద బందోబస్తు లేదని ఆయన ఆరోపణలు చేశారు.
Also Read : విచారణ తరువాత స్వరం మార్చిన కేటిఆర్
అయితే వాస్తవ పరిస్థితి మాత్రం జగన్ చెప్పేదానికి కంప్లీట్ గా భిన్నంగా ఉంది. తిరుమల, తిరుపతి నగరంలోని తొమ్మిది వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ కేంద్రాల వద్ద మొత్తం 1100 మంది సిబ్బందిని మొహరించారు. ప్రత్యేక బలగాలు 192 మంది, అలాగే 78 మంది ఎస్ఐలు, 38 మంది సీఐలు, 11 మంది డిఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 26న ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుండి శెట్టిపల్లి కి వెళ్ళినప్పుడు ఏకంగా 2200 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు.
Also Read : తప్పంతా మీదే.. అధికారులపై బాబు ఫైర్…!
జనాలను బస్సుల్లో బలవంతంగా తరలించారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పుడు పోలీసులను కూడా బలవంతంగా జగన్ పర్యటన కోసం బస్సుల్లో తరలించడం వివాదాస్పదమైంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్, అనంతపురం జిల్లాల నుంచి ఎక్కువ మందిని బందోబస్తు విధులకు కేటాయించారు. అయితే తాజాగా చంద్రబాబు పర్యటనకు మాత్రం ఎక్కడా ఆంక్షలు విధించలేదు. మొత్తంగా ఆయన పర్యటనలో కేవలం 1200 మంది పోలీసులు ఉన్నారు. ఇవన్నీ మరిచి జగన్ ఆరోపణలు చేయడం కాస్త కామెడీగా మారింది.