Friday, September 12, 2025 09:29 PM
Friday, September 12, 2025 09:29 PM
roots

చీలిక దిశగా వైసీపీ.. నష్ట నివారణలో జగన్?

వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప మొన్న శాసనసభ ఎన్నికలలో బద్దలైంది. జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకోవలసిన వైసీపి కేవలం మూడే గెలుచుకోగలిగింది. అప్పటి నుంచే కడప వైసీపిలో లుకలుకలు మొదలయ్యాయి. తాము టిడిపి, జనసేన, బీజేపీల ప్రభంజనంలో ఓడిపోయామనే విషయం వారికి తెలుసు అయినా తమ ఓటమికి మీరే కారణం అంటే కాదు మీరే అని వైసీపి నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మరోపక్క ఇంతకాలం కడప జిల్లాలో ఎక్కడ చూసినా జగన్‌, వైసీపి నేతల ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతల ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లే కనిపిస్తున్నాయి.

వైసీపి కంచుకోట ఎలాగూ బద్దలైపోయింది. ఇప్పుడు ఈ మార్పులను గుర్తించకుండా అలసత్వం ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల నాటికి జిల్లా నుంచి వైసీపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి గ్రహించారు. ముఖ్యంగా పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం అందగానే నేడు తాడేపల్లి ప్యాలస్‌లో కడప జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సున్నితంగా హెచ్చరిస్తూనే జిల్లా ఇన్‌చార్జి సురేశ్ బాబుని తప్పించేసి తన మేనమామ రవీంద్రనాధ్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించారు. అలాగే కమలాపురం నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఆయన కుమారుడు నరేన్ రామాంజనేయ రెడ్డిని నియమించారు.

ఇంతకాలం కడపలో వ్యవహారాలను ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే వివేకా హత్య కేసు విచారణ వేగవంతం అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఆయన సూచన మేరకే రవీంద్రనాధ్ రెడ్డికి కడప బాధ్యతలు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపి నేతలు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, పార్టీలో సీనియర్లపైనే వరుసగా కేసులు నమోదు అవుతుండటంతో అందరూ ఆందోళనగానే ఉన్నారు. కొంతమంది వైసీపి ఎమ్మెల్యేలు పార్టీ మారాలని అనుకుంటున్నప్పటికీ టిడిపి తలుపులు మూసుకుపోయాయి.

ఇక జనసేన, బీజేపీలు టిడిపిని కాదని వారిని చేర్చుకోకపోవచ్చు. కనుక వైఎస్ షర్మిల వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆమె కూడా ఏకాకిగానే ఉన్నారు. కనుక వైసీపి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకోగలిగితే అధిష్టానం వద్ద మళ్ళీ గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తాయని ఆమె భావిస్తున్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న తెర వెనుక ప్రయత్నాలను కూడా జగన్‌ గమనించే ఆమెను కట్టడి చేసేందుకు ముందుగా కడపలో ఈ మార్పులు చేసిన్నట్లు సమాచారం. మరి మొత్తం మీద జగన్ చేసిన ఈ మార్పులు వైసీపీలో చీలికను ఆపగలదా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్