వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఓ నీతి… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ నీతి అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నాడు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. మాచర్లలో ఓ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ఓ న్యాయవాదిపై కూడా దాడి చేశారు.
Also Read : పాపం… ఆయన మాట లెక్కచేయని సీనియర్లు…!
కారులో పోతున్న వారిని వెంటబడి మరీ కర్రలతో కొట్టారు. చివరికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చారు టీడీపీ నేతలు. పల్నాడులో ఓ గ్రామంలో రహదారికి అడ్డుగా గోడ కట్టారు. దీనిపై నాటి హోమ్ మంత్రి సైతం… కనీసం చర్యలు తీసుకోకపోగా… తప్పముంది.. వాళ్లకు వీళ్లకు గొడవలు రాకుండా గోడ కట్టుకున్నారు… అంతే కదా అని అనేశారు. దీంతో ఐదేళ్ల పాటు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అని నాటి విపక్ష నేతలు విమర్శలు చేశారు.
ప్రతిపక్షాలకు చెందిన అధికార ప్రతినిధులపై దాడులు, కేసులు, హత్యాయత్నం, సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు, వ్యక్తిత్వ హననం, చివరికి జగన్‌ను వ్యతిరేకించిన సొంత చెల్లి వైఎస్ షర్మిలతో పాటు డా.సునీతా రెడ్డి పై కూడా నీచమైన పోస్టులు పెట్టారు. అదే సమయంలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ఎవరైనా పోస్ట్ పెట్టినా సరే… చివరికి పోస్ట్ షేర్ చేసినా సరే.. వారిపై కేసులు పెట్టారు. ఇదేంటి అని ప్రశ్నించేందుుకు కూడా చాలా మంది భయపడ్డారు. ఇక నాటి ప్రతిపక్ష నేతలు కాలు కదిపేందుకు కూడా పోలీసులు అనుమతివ్వలేదు. చంద్రబాబును విశాఖ, తిరుపతి ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు, పవన్‌ను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేశారు.
Also Read : ఇప్పుడు ఆ అధికారిని ఏం చేస్తారో…?
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేస్తున్నారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై కావాల్సినన్ని విమర్శలు చేస్తున్నారు. దీంతో కొంతమంది వైసీపీ మూకలు అధినేత అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 151 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ కూడా చేశారు.
దీంతో ఏదో అన్యాయం జరిగిపోతోందని జగన్ గగ్గొలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన వారి గొంతు నొక్కేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టారు. మరి గతంలో మీ ప్రభుత్వం చేసిన పనేంటి జగనన్న అని సోషల్ మీడియాలో వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు మీరు చేసినదాంతో పోలిస్తే… ఇప్పుడు వీళ్లు ఏం చేయలేదు కదా అని కూటమి ప్రభుత్వంపై సెటైర్లు కూడా వేస్తున్నారు.