Friday, September 12, 2025 03:32 PM
Friday, September 12, 2025 03:32 PM
roots

ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?

ఆడలేక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి ఒకడు.. అలా ఉంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏం మాట్లాడుతున్నాడో కూడా జగన్‌కు అర్థం కావడం లేదు. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో జగన్ నవ్వుల పాలవుతున్నారు కూడా. వై నాట్ 175 అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే ప్రతిపక్షం అవసరం లేదన్నారు. కానీ చివరికి కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చేది లేదని భీష్మించుకున్నాడు జగన్. అయితే తాజాగా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు జగన్‌లో భయం పుట్టించినట్లున్నాయి. దీంతో కొత్త లాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చారు జగన్.

Also Read: ఒక్క టూర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్

లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. అసెంబ్లీ సభ్యత్వం రద్దు అంటూ వేసిన ప్రశ్నకు జగన్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సభకు వస్తాను… అయితే చంద్రబాబుకు ఇచ్చినంత సమయం నాకు ఇస్తారా… అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో సొంత పార్టీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. “ఏం మాట్లాడుతున్నావు రా… నరాలు కట్‌ అయిపోతున్నాయి…” అంటూ నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళీ డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌కు.. లీడర్ ఆఫ్ ది హౌస్‌తో సమానంగా సమయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇవ్వాలో అంతే ఇస్తామని ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Also Read: మాటలేనా.. నిజంగా చేతల్లో చూపించే దమ్ముందా?

పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి… లీడర్ ఆఫ్‌ ది హౌస్‌కు ఇచ్చినంత సమయం తనకు కావాలని అడగటం విడ్డూరంగా ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు. జగన్ మాటలకు సోషల్ మీడియాలో కూటమి నేతలు ప్రశ్నల వర్షం కురిస్తున్నారు. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబుకు ఎంత సమయం ఇచ్చారో జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు తిరగేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిరోజు టీడీపీ సభ్యులు సభకు వచ్చినప్పటికీ… వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని… పైగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మర్చిపోయారా జగన్.. అని నిలదీస్తున్నారు. అప్పుడు ఇవ్వని సమయాన్ని ఇప్పుడు అడగటం ఎంత వరకు సమంజసం అంటున్నారు. చంద్రబాబుతో సమానంగా సమయం ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్