Saturday, September 13, 2025 08:58 AM
Saturday, September 13, 2025 08:58 AM
roots

టిడిపి బలహీనతనే ఆయుధంగా మలచుకుంటున్న జగన్

వైసీపీలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది అనే మాట వాస్తవం. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి మీద ఈ తరహా ఆరోపణలు రావడం ఆ పార్టీ కార్యకర్తలను సైతం వేధిస్తున్న విషయంగా చెప్పాలి. ఇక విజయసాయి రెడ్డిని ఈ వ్యవహారం నుంచి బయట పడేయడానికి జగన్ కాస్త గట్టిగానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం గత రెండు రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని జగన్ వాడుకుంటున్నారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంఘటనను జగన్ రాజకీయంగా వాడుకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

ఈ విషయంలో అసలు తెలుగుదేశం పార్టీ గాని ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయంగాని లేకపోయినా జగన్ ఈ విషయాన్ని టీడీపీ వైపు తిప్పారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాననడం, రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే ఆలోచన చేయడం, ప్రధానిని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఆయన డిమాండ్ చేయడం వంటి అంశాలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ హత్య చేసిన వ్యక్తి, మరణించిన వ్యక్తి ఇద్దరూ వైసీపీకి సంబంధించిన వారే. వారు ఇద్దరికీ గతంలో నేర చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. దీని మీద ఇప్పటికే పోలీసు అధికారులు కూడా స్పందించి వాస్తవాలు చెప్పారు. అయినా సరే జగన్ దీనిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం వెనుక ప్రధాన కారణం, విజయసాయి రెడ్డి వ్యవహారం మీడియాలో లేకుండా చేయడమే అని అంటున్నారు.

విజయసాయి రెడ్డిని వైసీపీలో ఉన్న వారే ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తుండగా, జగన్ మాత్రం విజయసాయి రెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే రాజకీయంతో సంబంధం లేని విషయాన్ని వినుకొండ వెళ్లి జగన్ వాడుకున్నారని అంటున్నారు. జగన్ వాడుకోవడం అనడం కంటే, టిడిపి ప్రభుత్వ బలహీనతే జగన్ కి వరంలా మారింది. జరిగిన సంఘటన గురించి వైసీపీ శ్రేణులు చాలా ఆర్గనైజ్డ్ గా టిడిపి వారు చేసినట్లుగా ప్రచారం చేసేవరకు ప్రభుత్వం నుంచి కానీ, టిడిపి నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం జగన్ కి కలిసొచ్చిన అంశం. ఇలా టిడిపి బలహీనతనే జగన్ తనకి అనుకూలంగా మలచుకుంటూ వేగంగా ఎదిగేందుకు వాడుకుంటున్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్