వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి అనే మాట కంటే కూడా.. అక్రమాస్తుల కేసులో ముద్దాయిగానే ముందుగా అందరికీ పరిచయం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించరనేది బహిరంగ రహస్యం. 2004 ఎన్నికలకు ముందు.. 2009 ఎన్నికల నాటికి వైఎస్ కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పులు చేసే పరిస్థితి నుంచి… అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే స్థాయికి వైఎస్ కుటుంబం ఎదిగిపోయింది. ఇక జగన్ అయితే చేయని వ్యాపారం లేదు. మైనింగ్, ల్యాండ్, శాండ్, పవర్, సిమెంట్, మీడియా.. ఇలా అవకాశం ఉన్న ప్రతి వ్యాపారంలో కూడా జగన్ పెట్టుబడులు పెట్టారు. అదేంటో తెలియదు కానీ… మిగిలిన వారికి నష్టాలు వస్తుంటే.. జగన్ సంస్థలకు మాత్రం లాభాలు వచ్చి పడిపోయాయి. కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపారం కూడా నష్టాల్లో లేదు. ఆ స్థాయిలో వ్యాపారం చేసిన జగన్.. వేల కోట్లను సంపాదించారు.
Also Read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే
జగన్ అక్రమాస్తులపై కేసు నమోదు చేసిన ఈడీ ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. అప్పుడే జగన్ సంపాదన ఏ రేంజ్‌లో ఉందో బయట ప్రపంచానికి తెలిసింది. అయినా సరే.. జగన్ ఎప్పుడు చూసిన చెప్పే మాట ఒకటే. తాను నిరుపేద అంటూ బేల పలుకులు పలుకుతారు. ఇక 2024 ఎన్నికలప్పుడు అయితే.. ప్రతి అభ్యర్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేస్తూ.. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రమే అని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క మాట వారి జాతకాలు బయటకు వచ్చాయి. వారి ఆస్తుల వివరాలను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్తి కూడా అప్పట్లో కోటిశ్వరుడే. ఇక వైసీపీకి కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చేశాయనేది బహిరంగ రహస్యం. జగన్‌కు పులివెందుల, హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్‌లున్నాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్‌లో జగన్ కాలు పెట్టి దాదాపు పది నెలలు దాటిపోయింది. అయినా సరే అక్కడ నెలకు పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పులివెందుల ప్యాలెస్ విషయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే పులివెందుల వెళ్తున్నారు జగన్. బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మాత్రం ఎన్నికల్లో ఓడిన తర్వాత మకాం మార్చేశారు. అంతకు ముందు అటు వైపు వెళ్లింది లేదు. కానీ ఖర్చు మాత్రం కామన్.
Also Read : అదే నిజమైతే.. 16 నెలల సంగతి ఏంటీ..?
అయితే ఇటీవల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలకు నేతలే ఖర్చు భరించాలని జగన్ సూచించినట్లు సమాచారం. అది చిన్నదైనా సరే.. పెద్ద కార్యక్రమం అయినా సరే.. ధర్నా మొదలు.. అధినేత పర్యటన వరకు ఆయా నియోజకవర్గం సమన్వయకర్తదే పూర్తి బాధ్యత అని షరతు విధించారట జగన్. అదెలా సార్ అని అడిగితే.. ఐదేళ్లు బాగానే సంపాదించారు కదా.. పెట్టండి పర్లేదు.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు అంతకంతకు వసూలు చేసుకోవచ్చు అని ఉచిత సలహా కూడా ఇచ్చారట జగన్. దీనిపై పార్టీ నేతల్లో ఇప్పటి నుంచే గుబులు మొదలైంది. నాలుగేళ్లు పాటు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత.. తీరా చివరి నిమిషంలో సర్వేల్లో నీకు మార్కులు రాలేదు.. నీకంటే మంచి అభ్యర్థి దొరికాడు అని టికెట్ ఇవ్వకపోతే.. పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Also Read : వంశీకి వైసీపీ మద్దతు ఎక్కడ..? రజనీ కోసం రంగంలోకి పార్టీ అధిష్టానం..!
వాస్తవానికి జగన్ మాటలను రాష్ట్ర ప్రజలతో సొంత పార్టీ నేతలు కూడా నమ్మటం లేదు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చరిత్ర జగన్ సొంతం. అందుకే ఓటర్లు జగన్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ నేతలు కూడా ఈ విషయంలో జగన్ పైన ఎలాంటి నమ్మకం లేదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా టికెట్ ఇస్తా అంటూ చాలా మంది నేతలకు జగన్ ఆశ చూపించారు. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేశారు. ఉదాహరణకు 2014 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ నీకే అని వరుదు కల్యాణికి జగన్ హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరిన ధర్మాన ప్రసాదరావుకు టికెట్ ఇచ్చారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన జంకెతో చివరి రోజు వరకు ఖర్చు పెట్టించిన జగన్.. చివరి నిమిషంలో మాత్రం సర్వే ఫలితాలు అంటూ సాకు చూపించి కుందూరు నాగార్జున రెడ్డికి టికెట్ ఇచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్. అప్పటి వరకు మధుసూదన్ యాదవ్‌కు టికెట్ ఇస్తా అని చెప్పిన జగన్.. చివర్లో అన్నా రాంబాబుకు ఇచ్చేశారు.
Also Read : ప్రభుత్వం కూలుతుందా..? సైలెంట్‌గా కాంగ్రెస్..?
ఇదేంటి సార్ అని జగన్ దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు. జగన్‌కు ఎదురు చెబితే ఏమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బేల చూపులు చూడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆ రోజు టికెట్ ఇవ్వకుండా.. ఏ ఎమ్మెల్సీనో, నామినేటెడ్ పదవో ఆశ చూపించి నోరు మూయిస్తాడు తప్ప.. హామీ మాత్రం అమలు చేయరు. జగన్ ఎవర్నీ లెక్క చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన దగ్గర అంతా గప్ చుప్. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగేళ్ల పాటు ఖర్చు అంటే.. తడిసి మోపెడు అవుతుంది. ఇప్పటి నుంచి ప్రతి చిన్న విషయంలో ఖర్చు పెట్టాలంటే అది అసాధ్యం. వాస్తవానికి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు సంపాదించుకున్నది ఎవరూ అంటే.. ఐదుగురే అనేది వైసీపీ నేతల మాట. కనీసం రోడ్డు కాంట్రక్టులు కూడా గతంలో చేయలేదు. కాబట్టి తమ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పెట్టిన షరతుతో అవాక్కైన వైసీపీ నేతలు.. సైలెంట్‌గా తప్పుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.