Tuesday, October 21, 2025 02:22 PM
Tuesday, October 21, 2025 02:22 PM
roots

జగన్‍కు మరో సవాల్.. ఈసారైనా..!

ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో పెను సవాళ్లు కూడా బాగానే ఇరుకున పెడుతున్నాయి. నిన్నటి వరకు నాకు ఎదురే లేదు అన్నట్లుగా వ్యవహరించిన జగన్‌కు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో పెను సవాల్.. జగన్‌తో పాటు వైసీపీ నేతలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : ఇండో – అమెరికన్లకు బిగ్ షాక్.. వీసాల రివ్యూ స్టార్ట్..!

వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. వైఎస్ కుటుంబానికి ఇప్పటి వరకు కడప జిల్లాలో ఓటమి అనేది లేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బోటాబోటి మెజారిటీ వచ్చినప్పటికీ.. ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం పది నియోజకవర్గాల్లో 9 గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో అయితే క్లీన్ స్వీప్. 2024 ఎన్నికల్లో కూటమి హోరు గాలిలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. వీటిల్లో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్‌కు 60 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇటు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డికి కూడా 50 వేల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. దీంతో పులివెందుల వైసీపీ కంచుకోట అని అంతా అన్నారు.

కడప గడ్డ… వైసీపీ అడ్డా అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పారు. అలాంటి కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. వీటిల్లో పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థికి అయితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో తొలిసారి తమ ఆధిపత్యానికి బ్రేక్ పడినట్లు భావించిన జగన్.. కేంద్ర బలగాల పరిధిలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం తమకు వచ్చిందంటూ రాసిన స్లిప్ బ్యాలెట్ బాక్సులో లభించడం అక్కడి నియంత పరిస్థితులకు అద్దం పడుతోంది.

Also Read : టార్గెట్ బాబు, పవన్.. ప్రకాష్ రాజ్ కామెంట్..!

ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీలో పరువు పోయిన బాధలో ఉన్న జగన్‌కు ఇప్పుడు మరో సవాల్ ఎదురైంది. కడప జిల్లాలో ఖాళీ అయిన కార్పొరేషన్, మునిసిపల్ కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కడప, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేలు, కమలాపురం మునిసిపాలిటి, కార్పొరేషన్ పరిధిలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కడప, రాయచోటి, బద్వేలు, కమలాపురంలో రెండేసి స్థానాలకు, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు మునిసిపాలిటీల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. వీటిల్లో అందరి దృష్టి పులివెందుల మునిసిపాలిటీలోని 23వ వార్డుపైనే ఉంది. ఈ ఎన్నికలో టీడీపీ గెలిస్తే.. వైసీపీ పరువు పూర్తిగా పోతుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక బాధ్యతను ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్ అప్పగించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కనీసం పోటీ ఇవ్వలేదు. మరి పులివెందుల 23వ వార్డు ఉప ఎన్నికలో అయినా వైసీపీ గెలుస్తుందా.. లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్