Tuesday, October 21, 2025 05:07 PM
Tuesday, October 21, 2025 05:07 PM
roots

నేతలకు జగన్ డెడ్ లైన్..!

వైసీపీ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలంటే.. నేతలంతా ఎలా ఉండాలి.. ఎక్కడ ఉండాలి.. అనే విషయాలపై జగన్ కీలక సూచనలు చేసినట్లు తెలిస్తోంది. ఇందులో భాగంగా ముందు వైసీపీ ముఖ్య నేతలు ఎవరున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. అనే విషయాలపై జగన్ ఆరా తీశారు. తనకు అందుబాటులో ఉన్న నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై చర్చించారు.

Also Read : టీటీడీ కీలక నిర్ణయం.. అన్ని సేవలకు లక్కీ డిప్‌..!

వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్‌.. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో సభకు దూరంగా ఉన్నారు. కానీ ప్రతి వారం 3 రోజుల పాటు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో జగన్‌ను వర్క్ ఫ్రం బెంగళూరు పొలిటిషన్ అని టీడీపీ నేతలు పేరు పెట్టారు. అయినా సరే.. జగన్ మాత్రం వాటికి బదులివ్వలేదు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం రాజధాని అంశం. తొలి నుంచి రాజధాని అమరావతిపై విభిన్నమైన ప్రకటనలు చేశారు. తన ఇల్లు అమరావతి పరిధిలోనే ఉందన్నారు. కానీ తర్వాత 3 రాజధానులన్నారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఉద్యమం చేపట్టడం వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది.

రాజధాని అమరావతిపై కూడా జగన్ ఇప్పుడు మాట మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా జరిపిస్తోంది. 2027 జూన్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అనుకున్న విధంగానే కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనులు చేస్తున్నాయి. దీంతో మరోసారి అధికారంలోకి వస్తే.. రాజధానిగా అమరావతిని కొనసాగించడం తప్ప.. జగన్‌కు మరో అవకాశం లేదు.

Also Read : జూబ్లిహిల్స్ పై కవిత గురి..? పక్కా వ్యూహంతో బరిలోకి..!

వారం రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో రాజధానిపై సజ్జల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. దీంతో జగన్ కూడా ఇదే బెటర్ అనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. నేతలంతా సాధ్యమైనంత త్వరలో అమరావతి పరిధిలో ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశించారు. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, అమరావతిలో ఎక్కడో ఒకచోట సొంత ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు జగన్. అప్పుడే ప్రజలకు కూడా వైసీపీ పైన కాస్త సానుకూల అభిప్రాయం వస్తుందన్నారు. ఈ విషయంపై మరో మాట లేదన్నారు కూడా.

తాను కూడా 2019లోనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని.. అందుకే ప్రజలు నమ్మారన్నారు. టీడీపీ నేతలకు ఇక్కడ ఇళ్లు లేవని.. ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. జగన్ చేసిన సూచనలతో వైసీపీ ముఖ్య నేతలు ఖంగుతిన్నారు. అసలే అధికారం లేదు.. డబ్బులు లేని పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఇల్లు కట్టుకోవాలా అని మదన పడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్