Saturday, September 13, 2025 03:25 AM
Saturday, September 13, 2025 03:25 AM
roots

రోజురోజుకూ పెరుగుతున్న శత్రువులు..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది బహిరంగ రహస్యం. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వ సాధారణం. ఈ రోజు ఓ పార్టీలో ఉన్న నేత.. తెల్లారే సరికి మరో పార్టీలో చేరిపోతున్నారు. అయితే అలా చేరినప్పటికీ… వారంతా కేవలం రాజకీయ విమర్శలే తప్ప.. ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదు. ఇదంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసమే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ విమర్శల కంటే కూడా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల క్యారెక్టర్ పై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేయడం వైసీపీ వచ్చిన తర్వాతే మొదలైంది.

Also Read: వర్మకు పోలీసుల ప్రశ్నలు.. చెవిరెడ్డి సమాధానాలు..!

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరికైనా ఉంటారు. సొంత పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు సర్వ సాధారణం. కానీ జగన్ విషయంలో మాత్రం మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉన్నారనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. తండ్రి వైఎస్ఆర్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్… ఆయనకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లు పైగా రాజకీయాల్లో కొనసాగిన వైఎస్ఆర్… కోపం అనే నరం కట్ అయిన తర్వాతే తనకు సీఎం పదవి వచ్చిందని బహిరంగంగానే చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పట్టువిడుపులతో రాజకీయాలు చేశారు. చివరికి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుతో కూడా సరదాగా మాట్లాడారు… వేడుకల్లో ముఖాముఖి కలిస్తే.. ఎంతో ఆప్యాయంగా పలకరించిన సందర్భాలున్నాయి. కానీ జగన్ మాత్రం అలా కాదు.. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం… కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

Also Read: చీరాలలో గ్రూపు రాజకీయాలకు తెరతీసిన మాజీ ఎమ్మెల్యే..!

జగన్ ఒక్కసారి వ్యతిరేకిస్తా.. దానిని ఎంతో వ్యక్తిగతంగా తీసుకుంటారనేది సన్నిహితులు చెప్పే మాట. అయితే వాస్తవానికి ఈ ధోరణి రాజకీయాల్లో ఏ మాత్రం మంచిది కాదు. పట్టు విడుపులు లేకపోతే రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే తనను విమర్శించిన వారిని కూడా దగ్గరకు తీసుకున్న చంద్రబాబు.. వారికి ఉన్నత పదవులిచ్చిన సందర్భాలున్నాయి. తెలివిగా నడుచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే నీతి సూత్రం జగన్‌కు ఏ మాత్రం వర్తించదు. మొండిగా వ్యవహరించే జగన్.. తన సన్నిహితులపై కూడా విమర్శలు చేస్తారు. వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ 2029లో జగన్‌ సీఎం కావాలని కోరుకున్నారు విజయసాయిరెడ్డి. ఎంతో నమ్మకస్తుడు, ఆర్ధిక నేరారోపణల కేసులో సహ నిందితుడు అయిన విజయసాయిరెడ్డిపై జగన్ విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ చేసిన వ్యాఖ్యలకు సాయిరెడ్డి కూడా ఘాటుగానే బదులిచ్చారు.

Also Read: ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!

సాయిరెడ్డి రాజీనామాతో కాస్త అసహనానికి గురైన జగన్… విలువలు, నైతికత అంటూ పెద్ద పెద్ద మాటలన్నారు. ఓర్పు నశించిన జగన్… వ్యక్తిత్వం, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇవి రెండు జగన్‌కు లేవనేది విపక్షాల ఆరోపణ. పదేపదే విలువల గురించి మాట్లాడుతున్న జగన్… తనకు మాత్రమే విలువలున్నాయని… మరెవరికి లేవనేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో జగన్‌కు రోజురోజుకూ శత్రువుల సంఖ్య పెరిగిపోతోంది. చివరికి సాయిరెడ్డి వంటి నమ్మకస్తులు కూడా జగన్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవానికి రాజీనామా సమయంలో జగన్‌పై సాయిరెడ్డి ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ జగన్ మాత్రం వ్యక్తిత్వం, విశ్వసనీయతను బలిపెట్టారని… క్యారెక్టర్ ఏమిటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని కూడా శత్రువుగా భావించారు. రాజకీయాలు వద్దని వెళ్లిపోయిన సాయిరెడ్డి కూడా చివరికి కౌంటర్ ఇస్తున్నారంటే… అభిమానించే వారిని కూడా కెలికి మరీ శత్రువులుగా మార్చుకోవడంలో జగన్ తర్వాతే ఎవరైనా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్