Saturday, September 13, 2025 01:11 AM
Saturday, September 13, 2025 01:11 AM
roots

పాపం జగన్.. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా..!

లూలూ గ్రూప్ అంట.. లూలూ గ్రూపులకు లిల్లీ గ్రూపులకు రూ.2 వేల కోట్ల విలువైన భూములను టెండర్లు లేదు.. మన్ను లేదు.. పాడు లేదు.. ఊరికే ఆయన ఇష్టానికి.. ఆయనకు నచ్చింది ఇచ్చేసి.. నాకింత నీకింత అని పంచుకుంటున్నారు.. ఇవి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలు. విశాఖలో టీసీఎస్, లూలూ గ్రూప్ సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయించడంపై చంద్రబాబుపైన వైఎస్ జగన్ చేసిన ఆరోపణలివి. భూములను తక్కువ ధరకే కేటాయించారనేది వైసీపీ నేతల ఆరోపణ. అలాగే విశాఖ వంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో విలువైన భూములను తక్కువ ధరకు కేటాయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. అయితే జగన్ ఏం చేసినా సరే.. గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఆయనకే తగులుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్న జగన్.. ఏపీ ప్రజల ముందు తన అవగాహన రాహిత్యాన్ని నిరూపించుకున్నారు.

Also Read : అరెస్టు లిస్టు సిద్దం.. వైసీపీలో మొదలైన అలజడి

వాస్తవానికి ఏదైనా సంస్థకు భూములు కేటాయించాలంటే.. అది క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆ సంస్థ పనితీరు, పెట్టే పెట్టుబడులు, ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అనే విషయాలను చర్చించిన తర్వాత భూములు కేటాయిస్తారు. అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన పనులను టెండర్ల ద్వారా ఇస్తారు. అంతే తప్ప.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలకు టెండర్ల ద్వారా భూములు కేటాయించడం అనేది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలా ఇవ్వటం అసాధ్యం కూడా. అసలు పెట్టుబడులు పెట్టే సంస్థకు టెండర్లు ద్వారా భూములు ఎలా కేటాయిస్తారు.. ప్రభుత్వ భూమిని నామ మాత్రపు ధరకు లీజుకు ఇస్తారు తప్ప.. టెండర్ వేసి కేటాయించడం అసాధ్యం. ఇంత చిన్న విషయం కూడా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తికి తెలియకపోవడం నిజంగా జగన్ అవగాహన రాహిత్యానికి తార్కాణం.

Also Read : బెజవాడ జైల్లో వీఐపీ సందడి.. వంశీ టూ పీఎస్ఆర్

జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే తగులుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పలు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి భారీగా భూములు కేటాయించారు. దీనినే క్రిడ్ ప్రో కో కింది సీబీఐ, ఈడీ సంస్థలు పరిగణిస్తున్నాయి. వీటినే ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు జగన్ బాధితులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టి, హవాలా డబ్బులు ఇచ్చిన కంపెనీలకి తండ్రి వైఎస్ఆర్ టెండర్లు పిలిచారా.. అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఆస్తి పెంచుకోవడానికి మాత్రం టెండర్లు వద్దు.. ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగ పడే కంపెనీలకి కావాలి.. ఇదెక్కడి లాజిక్ అని నిలదీస్తున్నారు.

Also Read : జగన్‌కు ఆ మాత్రం తీరిక లేదా..?

సీబీఐ, ఈడీ దర్యాప్తుల ఆధారంగా అంటూ.. కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ సారధ్యంలోని వాన్‌పిక్ ప్రాజెక్ట్ కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏకంగా 24 వేల ఎకరాల భూమి ఇచ్చింది. ఈ కంపెనీ జగన్ సంస్థల్లో 850 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది ఈడీ ఆరోపణ. మరి ఈ 24 వేల ఎకరాల కేటాయింపునకు టెండర్లు పిలిచారా అంటే.. ఎలాంటి టెండర్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్.. APIIC ద్వారా భూమిని నేరుగా ఇచ్చారు. రైతుల నుంచి భూమి తీసుకుని, వాన్‌పిక్‌కి ఇచ్చారు. ఇందుకు భూమి ఇచ్చిన ఆర్డర్లు, పెట్టుబడి ఒప్పందాలే సాక్ష్యం.

ఇక లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇండు టెక్‌ జోన్.. కోసం ఇండు ప్రాజెక్ట్స్ కంపెనీకి 8 వేల 844 ఎకరాలను లేపాక్షి దగ్గర 250 ఎకరాలను శంషాబాద్‌లో ఇచ్చారు. ఈ కంపెనీ కూడా జగన్ సంస్థల్లో డబ్బు పెట్టిందని ఆరోపణ. ఎలాంటి టెండర్ లేకుండా APIIC ద్వారా నేరుగా ఇచ్చారు.

Also Read : బ్రేకింగ్: కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ఇక ప్రస్తుత వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలోని రామ్‌కీ గ్రూప్‌కి 2 వేల 400 ఎకరాలు ఇచ్చారు. విశాఖపట్నంలో రామ్‌కీ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూమి కేటాయించారు. వీళ్లు జగన్ సంస్థలో 10 కోట్లు పెట్టారని ఆరోపణ. నాటి ప్రభుత్వం గ్రీన్ కవర్ రూల్స్‌ని సడలించి మరి ఎలాంటి టెండర్లు లేకుండానే APIIC ద్వారా భూమి ఇచ్చారు. ఇందుకు ప్రభుత్వ ఆర్డర్లు, భూమి రికార్డులే సాక్ష్యం.

దాల్మియా సిమెంట్స్ కంపెనీకి కడపలో 407 హెక్టార్ల మైనింగ్ లీజ్, ఇండియా సిమెంట్స్‌కి భూమి, నీళ్లు ఇచ్చారు. వీళ్లు కూడా జగన్ సంస్థల్లో డబ్బు పెట్టారని ఆరోపణ. టెండర్లు పిలిచారా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. నేరుగా ప్రభుత్వ ఆర్డర్లతో భూమి, లీజ్‌లు ఇచ్చారు. ఇందుకు మైనింగ్ ఒప్పందాలు, ఈడీ రిపోర్టులు సాక్ష్యం.

Also Read : కసిరెడ్డి కేసు: ఏసీబీ కోర్ట్ లో యుద్ద వాతావరణం

సీబీఐ, ఈడీ నివేదికల ప్రకారం, ఈ కంపెనీలకు భూములు ఇచ్చేటప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి టెండర్లు పిలవలేదు. APIIC ద్వారా నేరుగా ఒప్పందాలు చేసి, భూములు ఇచ్చారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ఊరు పేరు లేని సంస్థలకు ఇలాగే భూమిని కేటాయించారు. అంతే తప్ప ఎలాంటి టెండర్లు పిలవలేదు. అలా టెండర్ల ద్వారా భూములు కేటాయించే విధానం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఇంత చిన్న విషయం కూడా సీఎంగా ఐదేళ్ల పాటు పని చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం.. నిజంగా ఆయన అమాయకత్వం అనాలో లేక మరేమైనా అనాలో అనే విషయం తెలియటం లేదు. జగన్‌కు ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లకు కూడా ఇలాంటి విషయాలు తెలియవా అని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.

 

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్