Tuesday, October 28, 2025 05:08 AM
Tuesday, October 28, 2025 05:08 AM
roots

నాడు సాయం అడిగిన చేతులతో నేడు దానం.. చంద్రబాబును కలిసిన యువ వ్యాపారవేత్త

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అమలు చేసిన కొన్ని కార్యక్రమాలు ప్రచారం చేసుకునే విషయంలో టిడిపి వెనకబడింది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా విదేశీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం విషయంలో కూడా టిడిపి ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఎందరో విద్యార్థులు పలు కార్యక్రమాలతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నారు. వారిలో ప్రస్తుతం చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

Also Read : ముంచేసిన మిథున్ రెడ్డి.. జగన్ పని అయిపోయినట్లే

ఎన్నో విషయాలపై ఫోకస్ పెట్టే టిడిపి నాయకులు ఇటువంటి విషయాలను మాత్రం ప్రచారం చేసుకోవడానికి వెనుకబడుతున్నారు. తాజాగా ఐర్లాండ్ లో చదువుకుని అక్కడ వ్యాపారం చేస్తున్న యువ వ్యాపారవేత్త ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కలిశారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది.. 2016 లో విదేశీ విద్య ద్వారా అతను ఐర్లాండ్ వెళ్లి అక్కడ ఎమ్మెస్ చేశాడు. అక్కడే స్థిరపడాలని ఉద్దేశంతో ఓ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం సక్సెస్ కావడంతో అతని లైఫ్ దాదాపుగా సెటిల్ అయిపోయింది.

Also Read : నితీష్ రెడ్డి తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేసినట్లేనా..?

దీనితో తన సంపాదనలో కొంత తన రాష్ట్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అతను భేటీ అయ్యాడు. ఓ నలుగురు పేద విద్యార్థులను చదివించేందుకు తాను స్కాలర్షిప్ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. నాడు సాయం తీసుకున్నానని నేడు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ అతను చంద్రబాబును కలిసి.. ఓ లేఖ కూడా ఇచ్చాడు. అతని పేరు సాత్విక్ మురారి. ప్రస్తుతం ఐర్లాండ్ లో ఉంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సాత్విక్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమైన చంద్రబాబునాయుడు అభినందించారు. తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే అతని తపన ఎంతో ఆకట్టుకుందని కొనియాడారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్