Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

వైసీపీ ఎమ్మెల్సీని ఆడుకున్న మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ బకాయిల వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తోంది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలకు మంత్రులు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 4200 కోట్ల బకాయిలు ఉన్నాయని… 2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయని.. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు ఇప్పటి వరకూ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. వసతి దీవెన మొదలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేసారు.

Also read : ఈ ఇద్దరి భవిష్యత్తు ఏంటీ..?

ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, వరుదు కల్యాణి ప్రశ్నలు.. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారా, హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా అని ప్రశ్నించారు. ఎప్పటిలోగా చెల్లిస్తారు అని నిలదీయగా మంత్రి బాలవీరాంజనే స్వామి సమాధానం ఇచ్చారు. వాళ్ళే బకాయిలు పెడతారు, వాళ్ళే చెల్లించాలంటూ ఆందోళన చేస్తారు‌ అని ఎద్దేవా చేసారు. పీజీ రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వమే ఎత్తివేసిందని మేము పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మూడు త్రైమాసికాల ఫీజు పెండింగ్ లో పెట్టిందని సమాధానం ఇచ్చారు.

Also read : వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!

గత ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్షలు కూడా రాయలేకపోయారని.. బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిస్తామన్నారు. వసతి దీవెన పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 40.85 శాతమే వసతి దీవెన ఇచ్చిందని… ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. మీరు స్కాలర్ షిప్ లు తీసుకున్నారో లేదో హౌస్ కమిటీ వేద్దామా అని ప్రశ్నించారు. విద్యాశాఖా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పై చర్చించిన రోజు ఎందుకు వాకౌట్ చేశారని నిలదీశారు. వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేకపోతున్నారని 4200 కోట్లు బకాయిలు పెట్టారని మీరు అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత అప్పటి వరకూ ఉన్న బకాయిలు చెల్లించారన్నారు. మేము వచ్చి పదినెలలు అయింది. మేము బకాయిలు చెల్లిస్తామని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్