ఒకవైపు విజయవాడ ప్రజల వరద నీటితో కష్టాలు పడుతుంటే… మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. విజయవాడలో జరుగుతున్నది ఇదే. వైసీపీ నేతలు బెజవాడ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. కనీస మానవత్వం లేకుండా వైసీపీ నేతలు విజయవాడ వరద విషయంలో తప్పుడు ప్రచారానికి ఏ మాత్రం సిగ్గు లేకుండా దిగారనే విషయం క్లియర్ గా అర్ధమవుతోందని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. విజయవాడలో వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా ఉంది.
ఈ సమయంలో కొందరు వరద బాధిత ప్రాంతాలల్లో రంగంలోకి దిగారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యాంకర్ లు విజయవాడలో పలు ప్రాంతాలల్లో రంగంలోకి దిగి… మీకు సహాయ కార్యక్రమాలు అందలేదని చెప్పాలని చెప్తే డబ్బులు ఇస్తామని, సరుకులు ఇస్తామని, మా పడవల్లో మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్తామని చెప్తూ తిరుగుతున్నారు. ఇప్పుడు బురదను తొలగించే విషయంలో కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా. కేవలం కమ్మ సామాజిక వర్గానికే ఇల్లు శుభ్రం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
Read Also :టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో కీలక ట్విస్ట్
అదే విధంగా వరద బాధితులకు ఆహారం అందించే విషయంలో కొందరు అధికారులతో కలిసి యూట్యూబ్ చానల్స్ వాళ్ళు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. కొందరు అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉండి, అక్కడ సహాయం అందలేదు అని యూట్యూబ్ చానల్స్ వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడ రంగంలోకి దిగి… వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో జరుగుతున్న ఈ కుట్ర ఆందోళన కలిగించింది. కావాలనే కొందరికి ఆహారం కూడా అందించకుండా అధికారులు సైతం అడ్డుకోవడం, వాళ్లకు యూట్యూబ్ చానల్స్ వాళ్ళు తోడు కావడం సమస్యను పెంచింది కొన్ని ప్రాంతాల్లో.




