Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

బిజెపిలోకి వైసీపీ ఎంపీ..? మదనపల్లి ఫైల్స్ అందుకే ఆగిందా..?

వైసీపీ నేతలు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడటానికి గ్రౌండ్ సిద్దం చేసుకుంటున్నారు. కుదిరితే పసుపు, లేదంటే కాషాయం ఈ రెండు సాధ్యం కాకపోతే ఎర్ర జెండా… అసలు ఏదీ వదలకుండా ప్రయత్నాలు వేగవంతం చేసారు. గత రెండు నెలల నుంచి ఈ విషయంలో స్పీడ్ గానే ఉన్నారు వైసీపీ నేతలు. ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు రాళ్ళు వేస్తే ఒకరిది తగిలింది. ఇంకొకరు మాత్రం ఓ మంత్రి గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి నలుగురు రాళ్ళు వేస్తే మూడు తగిలి ఒకటి పెండింగ్ లో ఉంది.

ఇప్పుడు చిత్తూరు జిల్లా వంతు వచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డి… తాడేపల్లి కంటే ఢిల్లీ బిజెపి ఆఫీస్ కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. వై కేటగిరి భద్రత కూడా తెచ్చుకున్నారు ఆయన. అందుకే తన తండ్రిపై ప్రభుత్వం పెట్టబోయే కేసులను అడ్డుకున్నారని, మదనపల్లి ఫైల్స్ కేసు అందుకే వాయిదా పడుతూ వస్తోందని అంటున్నారు. మిథున్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్టు కనపడుతున్నా ఆయన పిచ్ మాత్రం ఢిల్లీలో ఉంది. అందుకే ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. ఇది గమనించిన జగన్… తండ్రీ కొడుకులు ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించేశారు.

Also Read : పాపం బీఆర్ఎస్… వరసగా అన్నీ ఎదురుదెబ్బలే..!

ఇప్పటికే చాలా కాలం నుంచి మిథున్ రెడ్డి పార్టీ మారతారు అని ప్రచారం జరుగుతున్నా, ఇప్పటి వరకు దాని పై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆయన పార్టీ మారినా, మారకపోయినా బిజెపి నుంచి మద్దతు అయితే తెచ్చుకోగలిగారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత ఐదు సంవత్సరాల్లో ఏపీలో జరిగిన అవినీతిలో వీరిది ప్రధాన పాత్ర ఉండటం, వైఎస్ జగన్ తో ఉన్న ఆర్ధిక లావాదేవీల కారణంతో, కేంద్రంలో పెద్దలని వీరు డబ్బుతో కొట్టారు అన్న ప్రచారం జరుగుతుంది. అందుకే వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే టిడిపి ప్రభుత్వం ఈ విషయంలో బిజెపి పెద్దల ఒత్తిడికి తలొగ్గుతుందా, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే ధైర్యం చేయగలుగుతుందా అన్నది వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్