వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే అంటున్నారు. తాము ఎంతో కష్టపడి చట్టసభలకు ఎన్నికైతే.. జగన్ ఏంటి ఇలా చేశాడు అని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. వైసీపీ నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేల ఆశలపై వైఎస్ జగన్ నీళ్లు చల్లారు. అసెంబ్లీకి వెళ్లాలనే నేతల కోరిక మాత్రం నెరవేరలేదు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు.
Also Read : జగన్ ను ఫాలో అవుతున్న కేటిఆర్
గెలిచిన 11 మందిలో పాతవారు మినహాయిస్తే… నలుగురు కొత్తవారున్నారు. వీళ్లంతా అసెంబ్లీ మెట్లు ఎక్కాలని… అసెంబ్లీ హాల్‌లో అధ్యక్ష అంటూ మాట్లాడాలనేది వాళ్ల కోరిక. తమ ప్రాంత సమస్యలపై ప్రభుత్వాన్ని సభలో డిమాండ్ చేయాలనేది కూడా వైసీపీ ఎమ్మెల్యేల భావన. అయితే మీరు వెళ్లండి… నేను రాను అని జగన్ తన ఎమ్మెల్యేలతో అంతర్గతంగా వ్యాఖ్యానించారట. అధినేత రాకుండా తాము మాత్రమే వెళితే… భవిష్యత్తులో అధినేత ఆగ్రహానికి గురి అవుతామని నేతలు భయపడుతున్నారు.
మనం అసెంబ్లీకి వెళ్లకుండా తప్పుచేస్తున్నామా అని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఈ విషయాన్ని జగన్ ముందు చెప్పేందుకు సాహసం చేయలేకపోయినప్పటికీ… సన్నిహితుల దగ్గర మాత్రం… జగన్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారం లభిస్తుందనేది ఎమ్మెల్యేల భావన.
Also Read : విజయ్ పాల్ కు ముహూర్తం ఫిక్స్…?
పాడేరు నుంచి ఎన్నికైన విశ్వేశ్వరరాజు రాజకీయాలకు కొత్త కావడంతో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో అధికారులు ఆయన మాట పెద్దగా లెక్క చేయటం లేదట. కాబట్టి తమ ప్రాంత సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా అధికారుల్లో కూడా చలనం వస్తుందనేది ఎమ్మెల్యే మాట. ఇక అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కూడా అసెంబ్లీలో పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అరకు ప్రాంత వాసుల సమస్యలపై చర్చించాలని భావిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు.
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటి సమస్యలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చించేందుకు ఆరాటపడుతున్నారు. కానీ జగన్ మాత్రం అందుకు అనుమతించటం లేదు. కొత్తగా గెలిచిన నలుగురు కూడా రిజర్వ్ నియోజకవర్గాలకు చెందిన వారే. ఇద్దరు ఎస్టీలు కాగా… ఇద్దరు ఎస్సీలు. ఇక మిగిలిన ఏడుగురిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డా.దాసరి సుధ, వై.బాలనాగిరెడ్డితో పాటు వైఎస్ జగన్ ఉన్నారు.
Also Read : పిల్ల సజ్జల గ్యాంగ్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు
వీరంతా ఇప్పటికే సభకు వచ్చిన వారే. అయితే వీరిలో కొందరు.. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఇలా సభకు దూరంగా ఉండటం ఏమిటనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇలాగే సభకు దూరంగా ఉంటే… భవిష్యత్తులో ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతాయని… ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే.. మరోసారి పోటీ చేసినప్పుడు ఓట్లు అడగొచ్చనేది సన్నిహితుల సూచన. పార్టీ మారాలని ఎమ్మెల్యేలకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు.




