ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీ మరిన్ని ఇబ్బందులు పడుతోంది. ఆ పార్టీ నుంచి ఎప్పుడు.. ఎవరు బయటకు వస్తారో అర్ధం కాక పార్టీ అధిష్టానం తల పట్టుకుంటుంది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో… పార్టీ ఒక్కసారిగా కుదేలు అయిపొయింది. పార్టీ కీలక నేతగా ఆ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 గా.. కొనసాగుతున్న విజయసాయిరెడ్డి.. అనూహ్యంగా రాజకీయాలకు కూడా గుడ్ బాయ్ చెప్పారు. ఇక ఇప్పుడు తమను తాము కాపాడుకునేందుకు వైసీపీ నేతలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : బెట్టింగ్ యాప్స్.. బయటకు వస్తున్న మోసగాళ్ళు..!
త్వరలోనే కొంతమంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేని వారు.. బీజేపీ లేదా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టిడిపిలో అవకాశం ఉన్న నేతలు ఆ పార్టీ అధిష్టానంతో ఇప్పటికే టచ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బిజెపిలోకి వెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయిపోయారు.
Also Read : చిరంజీవి – అనీల్ రావిపూడి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదే
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం బిజెపిలోకి వెళుతున్నట్లు సమాచారం. వైసీపీలో ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరు నేతలను.. కేసులు వెంటాడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీతో దూరంగా ఉన్న మాజీ నాయకుడు.. కూడా బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.
Also Read : హైదరాబాద్ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం…!
తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే పార్టీని రాష్ట్రంలో ఆర్థికంగా కూడా నిలబెడతానని సదరు నేత హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసి ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2029 నాటికి కీలక నేతలు బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.