Tuesday, October 28, 2025 05:20 AM
Tuesday, October 28, 2025 05:20 AM
roots

వైసీపీకి మరో షాక్.. పల్నాడు జిల్లా షేకింగ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి ఎప్పుడు.. ఎవరు బయటకు వస్తారో అర్థం కాక పార్టీ నేతలు, కార్యకర్తలు.. తల పట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధిష్టానం బయటకు వెళ్ళే నేతలను ఆపలేక చేతులు ఎత్తేసింది. ఇటీవల కాలంలో కొంతమంది నేతలు ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తీరుపై అసహనంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు కేసుల భయం కూడా కొంతమంది నేతలను వెంటాడుతోంది. ఇప్పుడు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది.

Also Read : కొత్త డ్రామా మొదలుపెట్టిన వైసీపీ..!

వైసీపీలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతల్లో కాసు మహేష్ రెడ్డి కూడా ఒకరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులను.. గురజాల నియోజకవర్గంలో ఆయన అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నికల సమయంలో కూడా కాసు మహేష్ రెడ్డి రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. వరుసగా నేతలపై ఉన్న కేసులను పోలీసులు బయటకు తీయడంతో కాసు మహేష్ రెడ్డి జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం మొదలైంది.

Also Read : జత్వాని కేసు ఆటకెక్కిందా..? తెరవెనుక ఏమి జరుగుతుంది..?

గత కొన్ని రోజులుగా కాసు మహేష్ రెడ్డి ఎక్కడున్నారో కూడా కనపడటం లేదు. ఇక నియోజకవర్గంలో యరపతినేని శ్రీనివాస్ కూడా దూకుడుగానే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న యరపతినేని ఇప్పుడు నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, కబ్జాలు, అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఒక నివేదికను సిద్ధం చేసినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలోనే టిడిపి నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Also Read : ప్రభాస్ రూట్ లోనే ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండుగే…!

దీనితో ఏ క్షణమైనా కాసు మహేష్ రెడ్డి పై కొన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. నియోజకవర్గంలో వార్తలు గుప్పుమన్నాయి. దీనితో కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు జాగ్రత్తగా పడుతున్నారు. ఎలాగైనా జనసేన పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కొంతమంది నేతలను తీసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుంటున్నారు. మరి కాసు మహేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్