ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మధ్య వ్యవహారం మరోసారి సంచలనమైంది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ కల్తీ మద్యం తయారు చేస్తోందని, కల్తీ చేసిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు కీలక నేతలపై టిడిపి ఎన్నో ఆరోపణలు చేసింది. ఆ సమయంలో మద్యం అలవాటున్న ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ కల్తీ వ్యవహారం మరోసారి సంచలనమైంది. ఏకంగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కల్తీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టారు.
Also Read: డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు
ఇక తాజాగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. టిడిపి నేత అద్దేపల్లి జనార్దన్ రావు నేతృత్వంలో ఈ కల్తీ మద్యం వ్యవహారం జరుగుతోంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి స్థానిక కీలక నాయకుల అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. సాధారణంగా రాజధాని సమీపంలో మద్యం తయారు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ ఉన్న దగ్గరలో కల్తీ మద్యం.. ధైర్యంగా తయారు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అధికారులు లేదా స్థానిక నాయకుల సహకారం ఉండే ఉంటుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : రంగంలోకి జగన్.. క్యాడర్ తో మరో కీలక సమావేశం
దీనిపై వైసిపి ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో తమను కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి తీవ్ర స్థాయిలో టిడిపి విమర్శించడంతో, ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని టార్గెట్ గా చేసుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ కల్తీ మధ్య వ్యవహారానికి సంబంధించి.. జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. మంగళవారం పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తున్న వైఎస్ జగన్.. కల్తి మద్యానికి కి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేసే విషయంలో నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనపడుతోంది.