Saturday, September 13, 2025 01:22 AM
Saturday, September 13, 2025 01:22 AM
roots

వారిద్దరి కష్టం… బూడిదలో పోసిన పన్నీరేనా..?

వైసీపీలో ఇతర నేతలకు సరైన గుర్తింపు రాదు అనే మాట అక్షరాల నిజం. ఇది 2012లో పార్టీ పెట్టిన నాటి నుంచి వినిపిస్తున్న మాట. కేవలం తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి, బంధువులకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది వాస్తవం. పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సొంత సామాజిక వర్గానిదే పై చెయ్యి. బీసీ సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేపట్టినప్పటికీ.. అదంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. చివరికి వైఎస్ జగన్‌ ఎన్నికల సమయంలో నా ఎస్సీలు, నా బీసీలంటూ ఎంతగా దగ్గరవ్వాలని చూసినా ఆయా సామాజిక వర్గాల నేతలు మాత్రం ఆయనను విశ్వసించలేదు.

Also Read : భజన చేస్తే తాట తీస్తా… బాబు మాస్ వార్నింగ్…!

ఇక ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు మహిళా నేతలకు తీరని అన్యాయమే జరుగుతోంది. వాస్తవానికి ముఖ్యనేతలంతా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి మహిళా నేతలు రాజీనామా చేయగా… హోమ్ మంత్రులుగా పని చేసిన సుచరిత, వనితలు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. ఇక రోజా మాత్రం అప్పుడప్పుడు చెన్నై నుంచి నగరి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. దీంతో వైసీపీ మహిళా అధ్యక్షురాలు పదవిని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి అప్పగించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించారు. ఇప్పుడు వీరిద్దరి పరిస్థితే అగమ్య గోచరంగా మారిపోయింది.

Also Read : చంద్రబాబు సంచలన నిర్ణయం..!

వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలా రెడ్డి… ఇప్పటి వరకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కనీసం ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. హైదరాబాద్ నుంచే అప్పుడప్పుడు వాట్సప్ ద్వారా వీడియోలు విడుదల చేస్తోంది తప్ప… జగన్‌ అప్పగించిన బాధ్యతలు ఏ మాత్రం నెరవేర్చడం లేదు. ఇక వరుద కల్యాణి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేయాలని అనుకున్నా సరే… పెద్దల నుంచి సహకారం అందటం లేదు. పైగా అనుమతి కూడా రావటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ధర్నా చేద్దామని అనుకుంటే… అవసరం లేదు అంటున్నారంట తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. దీంతో విశాఖ నుంచే అప్పుడప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టేసి మమ అనిపిస్తున్నారు వరుదు కల్యాణి. దీంతో ఈ ఇద్దరికీ పదవి ఉన్నా ఒకటే… లేకున్నా ఒకటే అనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్