Saturday, September 13, 2025 04:41 PM
Saturday, September 13, 2025 04:41 PM
roots

ఆయనకు మంత్రి పదవి ఖాయమా..!

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఇప్పుడు తీవ్రమైన పోటీ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు. వారిలో ఒకరు నారా లోకేష్, మరొకరు అనగాని సత్యప్రసాద్. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రేపల్లె నియోజకవర్గం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోకి చేరింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి ప్రస్తుతం లోకేష్ మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. లోకేష్‌ను టీడీపీ నేతలు భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తున్నారు. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు పలువురు సీనియర్ నేతలు.

Also Read : కేటీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. ఆ కేసు కూడా సీబీఐ చేతికి..?

పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీటిల్లో వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు సీనియర్లుగా ఉన్నారు. పెదకూరపాడు, మాచెర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో తొలిసారి గెలిచారు. దీంతో పల్నాడు జిల్లా నుంచి మంత్రిపదవి ఆశిస్తున్న నేతల మధ్య పోటీ నెలకొంది.

జీవీ ఆంజనేయులు రెండోసారి గెలిచారు. ఇక ప్రత్తిపాటి పుల్లారావు గతంలో మంత్రిగా పని చేశారు. అదే సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపు యరపతినేని శ్రీనివాసరావు పైనే ఉంది. ఇప్పటి వరకు యరపతినేని గురజాల నియోజకవర్గం వదిలి మరో నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1994లో తొలిసారి పోటీ చేసిన యరపతినేని ఏకంగా 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి గురజాల నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. యరపతినేని మీద పోటీ చేసే వాళ్లు మారుతున్నారు కానీ… ఆయన మాత్రం గురజాల నియోజకవర్గం ప్రజలను వదిలిపెట్టలేదు. వరుసగా 7 సార్లు పోటీ చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Also Read : ఎన్టీఆర్ వారసులపై అనుచిత వ్యాఖ్యలు..!

వాస్తవానికి మొదటి జాబితాలోనే యరపతినేనికి మంత్రి పదవి ఖాయమనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా పల్నాడు జిల్లా నుంచి ఒక్కరికి కూడా అవకాశం రాలేదు. ఇందుకు ఏకైక కారణం కులం. టీడీపీ అంటే కమ్మ పార్టీ అనే ముద్ర పడింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు, లోకేష్‌తో పాటు పయ్యావుల కేశవ్ మాత్రమే మంత్రిగా కమ్మ కులానికి చెందిన మంత్రి. యరపతినేనికి మంత్రి పదవి రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటారు విశ్లేషకులు.

గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి పైన 29 వేల పై చిలుకు ఓట్లతో యరపతినేని విజయం సాధించారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న యరపతినేని ఇప్పటి వరకు పార్టీ లైన్ దాటలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీ చేరేందుకు గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభ వేదికగా మారిందంటే.. యరపతినేని క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యరపతినేని. దీంతో ఈ సారి మంత్రివర్గ కూర్పులో యరపతినేనికి మంత్రిపదవి ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

పోల్స్