అంతర్జాతీయ క్రికెట్ లో ఒకటి రెండు అవకాశాలతో ఆటగాడి సామర్ధ్యాన్ని అంచనా వేయకూడదు. అక్కడి వరకు వెళ్ళాడు అంటే అతనిలో ఏదో టాలెంట్ ఉండబట్టే. కాని ఓ ఆటగాడి విషయంలో మాత్రం టీం ఇండియా మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. అతనే సాయి సుదర్శన్. ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా అతడిని జట్టులోకి తీసుకున్నారని అందరూ అంటున్నా.. ఇంగ్లాండ్ లో అతను కౌంటీ క్రికెట్ లో సత్తా చాటిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా సెంచరీ చేసాడు సాయి సుదర్శన్.
Also Read : పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు
ఇంగ్లాండ్ పర్యటన కోసం అతడిని టెస్ట్ జట్టులోకి తీసుకున్న్నారు. కాని కేవలం మొదటి టెస్ట్ లో మాత్రమే అవకాశం ఇచ్చారు. మొదటి టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినా రెండో ఇన్నింగ్స్ లో పర్వాలేదు. అయినా సరే అతన్ని రెండో టెస్ట్ కు పక్కన పెట్టారు. కరుణ్ నాయర్ మూడు టెస్ట్ లలో ఫెయిల్ అయ్యాడు. అయినా అతడిని నాలుగో టెస్ట్ లో ఆడించే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. నాయర్ మంచి ఆటగాడే.. కాని.. సుదర్శన్ కు ఒక్క అవకాశమే ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
Also Read : పంత్ ఆడాలా..? వద్దా..? గిల్ ముందు పెద్ద సమస్యే..!
జట్టు కెప్టెన్ గిల్ కంటే సుదర్శన్ టెక్నిక్ డిఫెన్స్ లో బాగుంటుంది. యార్కర్, షార్ట్ పిచ్ బాల్స్, ఇన్ స్వింగర్ లు సమర్ధవంతంగా ఆడే సత్తా ఉన్న ఆటగాడు. అయినా సరే అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గంభీర్ అభిప్రాయం ప్రకారం.. నాయర్ మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు కాబట్టి జట్టులో ఉంచుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాయర్ తో పోలిస్తే సుదర్శన్ మంచి ఫీల్డర్. గల్లీలో అయినా, స్లిప్ లో అయినా మంచి ఫీల్డింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. మరి నాలుగో టెస్ట్ లో అవకాశం ఇస్తారో లేదో చూడాలి.