Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

అక్కడికి వచ్చే ధైర్యం జగన్ కి ఉందా?

నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న… అదే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా… రాడా… అని. నిజమే… ఎన్నికల తర్వాత తొలి శాసనసభ సమావేశాల మొదటి రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అది కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే. ఆ తర్వాత రోజు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో జగన్‌ను కూడా ఓ ఎమ్మెల్యే మాదిరిగానే పరిగణిస్తారనే మాట బాగా వినిపించింది.

అయితే తొలి సమావేశాల మొదటి రోజున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అధికార పార్టీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మంత్రుల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత తనకు అవకాశం కల్పించాలని.. అలాగే ప్రత్యేక ద్వారం ద్వారా లోపలికి అనుమతించాలని కోరారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలిరోజున తన ఛాంబర్ నుంచి సరిగ్గా పేరు పిలిచే ముందు నేరుగా సభకు వచ్చిన జగన్… ప్రమాణం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సెషన్‌కు జగన్ గైర్హాజరయ్యారు.

Also Read : చంద్రబాబు ఇంటికి వైసీపీ బిగ్ ఫిష్

ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరోసారి జగన్ గురించి ప్రస్తావన తెరపైకి వచ్చింది. అసలు సభకు వస్తాడా… రాడా… వస్తే అధికార పార్టీ నేతల ఆరోపణలకు జవాబు చెబుతారా… కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రతి రోజు ఆరోపిస్తున్న వైసీపీ నేతలు… సభలో కూడా ఈ విషయంపై చర్చిస్తారా… వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి జరిగిందని సీఎం మొదలు… మంత్రులంతా ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఇప్పటికే కేసులు కూడా అరెస్టులు కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి వాటికి సభకు వచ్చి… తప్పుడు ఆరోపణలు.. కక్ష సాధింపు చర్యలని కొట్టిపారేస్తారా… ప్రభుత్వాన్ని నిలదీస్తారా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.

కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు… 2019-2023 మధ్య కాలంలో సభకు వచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు… వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా ధీటుగా జవాబిచ్చారు. చివరికి భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో గెలిచి సభకు వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు. అన్నట్లుగానే గెలిచి మళ్లీ సభకు వచ్చారు. గతంలో 2014-19 మధ్య కాలంలో అమరావతిలో జరిగిన సభకు మాత్రం ఓ ఏడాది హాజరయ్యారు జగన్. ఆ తర్వాత నుంచి పాదయాత్ర పేరుతో వైసీపీ నేతలు ఎవర్రూ రాలేదు. ఇప్పుడైనా వస్తారా… రారా.. అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్