దాదాపు మూడు నాలుగేళ్లుగా మెగా ఫ్యామిలీకి కష్టకాలం నడుస్తోంది. ఒక్క అల్లు అర్జున్ పక్కనపెడితే మిగిలిన మెగా హీరోలు ఎవరు కూడా.. అదిరిపోయే హిట్ కొట్టలేదు. చిన్న హీరోల నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఇదే పరిస్థితి. తాము ట్రోల్ చేసే హీరోలు పాన్ ఇండియా స్టార్లు కూడా అవుతుంటే మెగా హీరోలు మాత్రం వెనకబడటం చూసి ఫాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ ఇస్తూ వచ్చే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిపోతున్నారు.
Also Read : ఏపీకి కొత్తగా మరో రెండు.. కేంద్రం మంజూరు..!
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమాలో కొన్ని సీన్స్ ఫాన్స్ కు కూడా నచ్చలేదు. ఇక ఇప్పుడు మెగా ఫాన్స్ ఆశలన్నీ విశ్వంభరా సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. వాస్తవానికి డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ కొన్ని కారణాలతో సంక్రాంతి తర్వాత అని ప్రచారం జరిగింది. ఫిబ్రవరిలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ప్రచారం చేశారు. రామ్ చరణ్, గేమ్ చేంజర్ సినిమా కోసం చిరంజీవి తన సినిమాను వాయిదా వేశాడని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేశారు.
Also Read : బీసీసీఐ అధ్యక్షుడు అతనేనా..?
కానీ ఇప్పటివరకు సినిమాపై సరైన అప్డేట్ లేదు. అయితే రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. సినిమా అదిరిపోతుందంటూ చిరంజీవి కూడా తన సినిమాకు ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మెగా ఫాన్స్ మాత్రం గత కొన్నాళ్లుగా జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని పూజలు చేస్తున్నారు. చిరంజీవి సినిమా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ అయింది. కానీ ఆ సినిమాలో రవితేజ కూడా ఉండటంతో సినిమా క్రెడిట్ మొత్తం చిరంజీవికి రాలేని పరిస్థితి. ఇప్పుడు చిరంజీవి సోలోగా చేస్తున్న విశ్వంభరా సినిమా.. హిట్ కాకపోతే మాత్రం మెగా ఫాన్స్ మరింత డీలా పడిపోతారు. ఆ తర్వాత ఆశలన్నీ రామ్ చరణ్, పెద్ది సినిమా పైనే.




