“హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తే, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి. దీనికి బాధ్యత హోం మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి.” తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇది.
హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2024
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు విజయసాయి రెడ్డి ఇదే తరహాలో కామెంట్స్ చేయడం మనం ఎన్నో చూశాం. ఆయనొక్కడే కాకుండా వైసీపీ నేతలు అందరూ కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నేతల మాటలు మాత్రం మారడం లేదు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఆరోగ్య సమస్యపై విజయసాయి చేసిన కామెంట్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలలో ఆగ్రహానికి కారణం అయింది. ఇలా బరితెగించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డిని ఏం చేయకపోవడం, కనీసం ఆయనపై కేసు నమోదు చేయకపోవడం సంగతి టిడిపి అభిమానికి విస్మయానికి గురి చేస్తుంది.
టీడీపీ అధికారంలో లేనప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఎన్నో దారుణమైన వ్యాఖ్యలు చేసారు ఇదే విజయసాయి రెడ్డి. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అనిత పై కూడా ఇదే తరహా నిస్సిగ్గు ఆరోపణలు వచ్చాయి. వాటి మీద ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది. ఇప్పటి వరకు తప్పు చేసిన ఏ సోషల్ మీడియా కార్యకర్త పై కూడా చర్యలు దాఖలాలు లేవు. కనీసం వారి మీద కేసులు కూడా పెట్టడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ కార్యకర్తలను జైల్లో వేసి చిత్ర హింసలు పెట్టిన పరిస్థితి ఉంది. తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని తాము ఆశించలేదని టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదనలో అర్థముందని మీరు కూడా భావిస్తున్నారా?