ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో వైసిపి తో పాటుగా ఆ పార్టీ అనుకూల మీడియా అలాగే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు అమరావతి విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు వైసీపీ మద్దతుదారులు. 2024 లో పార్టీ అధికారం కోల్పోయిన సరే వారి తీరులో మాత్రం మార్పు రాలేదు.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు.. రిలీజ్ అప్పుడే
2019 నుంచి 2024 వరకు అమరావతిని కమ్మ రాజధాని అంటూ అప్పట్లో ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన కొందరు ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో విషం చిమ్ముతున్నారు. తాజాగా సాక్షి ఛానల్ డిబేట్లో పాల్గొన్న కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యలకు రాజధాని అంటూ అతను మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో, అమరావతి ప్రాంతంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక అతని ఫోన్ నెంబర్లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్స్ చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు.
Also Read : ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ మాస్ సర్ప్రైజ్
అతనిపై చర్యలు తీసుకోవాలని ఇంకొకరు అలా మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేస్తారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. వైసీపీ నేతలు కూడా ఇదే తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ విధంగా మాట్లాడిన వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంలో వెనుకబడి ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దీనిపై ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. వైసీపీ ప్రభుత్వం లో చిన్న చిన్న వాటికి కేసులు పెట్టిన.. ప్రస్తుత ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు పదేపదే జరుగుతున్న సరే కేసులు పెట్టడానికి మాత్రం పోలీసులు ముందుకు రావటం లేదు.
Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
ఇలాంటి వాటి విషయాల్లో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వటం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణంగా రాష్ట్రాలకు రాజధానిని కన్నతల్లిగా భావిస్తూ ఉంటారు. రాజధాని కేంద్రంగానే అభివృద్ధి మొత్తం విస్తరిస్తూ ఉంటుంది. రాజధాని విషయంలో నే రాష్ట్రానికి గుర్తింపు ఉంటుంది. అలాంటి రాజధాని విషయంలో ఇటువంటి అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మరికొంతమంది ఇలాగే మాట్లాడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా అమరావతి మునిగిపోతుందంటూ హడావుడి ప్రచారం కూడా చేస్తోంది. అయినా సరే దీనిపై చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. మరి దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.




