Saturday, September 13, 2025 01:15 AM
Saturday, September 13, 2025 01:15 AM
roots

ఈ విషయంలో బాబు కంటే జగనే నయం అనిపించాడు

“మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది…”, వైఎస్ జగన్ ను ఉద్దేశించి అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఇది. “నేను మా అధినేతలా కాదు…”, అప్పట్లో లోకేష్ చేసిన కామెంట్. ఇది జగన్ తో పాటుగా వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న అధికారుల పట్ల చేసిన కామెంట్ ఇది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలే చేసారు నాటి ప్రతిపక్ష టీడీపీ నేతలు. అంత వరకు బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నార్రా అంటే… ఏం పెద్దగా చర్యలు అయితే కనపడటం లేదు అనే చెప్పాలి. నేరాలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం తమను వేధించిన వాళ్ళ మీద కూడా తొందరగా చర్యలు తీసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

Read Also : మరో దస్తగిరి గా నందిగం సురేష్

నిన్న బోట్ల విషయంలో నిందితులుగా భావించే వాళ్లకు బెయిల్ వచ్చింది. అసలు పడవలు ఇంకా బయటకు రాలేదు. కానీ వాళ్లకు బెయిల్ మాత్రం వచ్చేసింది. అలాగే పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడంలో వెనుకా ముందు ఆడుతున్నారు. ఎందుకో అర్ధం కాని పరిస్థితి. స్వేచ్చగా తిరుగుతున్న వాళ్ళను వదిలేసి ఇప్పుడు దొరకడం లేదు అని కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు సుప్రీం కోర్ట్ లో బెయిల్ పిటీషన్ లు కూడా వేసుకుంటున్నారు. పెద్దిరెడ్డి కేసులో ఇప్పుడు కాస్త కదలిక వచ్చింది. గత జగన్ ప్రభుత్వంలో అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ రావడానికి చాలా కష్టపడేవారు.

కానీ ఇప్పుడు బెయిల్ అలా వెళ్తే ఇలా వచ్చేస్తుంది. పిన్నెల్లికి బెయిల్ వచ్చేసింది. నేరాలు చేసిన వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు. రేపో మాపో నందిగం సురేష్ కి కూడా బెయిల్ వచ్చేస్తుంది. జోగి రమేష్ కొడుక్కి ఇప్పటికే బెయిల్ వచ్చేసింది. మరి వాళ్ళ మీద పెట్టే కేసుల తీవ్రత ఎలా ఉందో గాని… అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు రాకుండా జగన్ అప్పట్లో కేసుల మీద కేసులు పెట్టించేవారు. ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కి పంపించేవారు. మాచర్లలో తోట చంద్రయ్యని నడిరోడ్డు మీద హతమార్చిన కేసు సంగతి ఏమయిందో ఇప్పటికీ తెలియదు. ఇలాంటి వ్యవహారశైలి కార్యకర్తల్లో ఆవేదన, ఆవేశం పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్