గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేసిన తర్వాత కృష్ణాజిల్లా నేతల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని వైసిపి కార్యకర్తలు ఊహించారు. ముఖ్యంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్, అలాగే మాజీ మంత్రి జోగి రమేశ్, మరో మాజీ మంత్రి పేర్ని నాని వంశీ కోసం బయటికి వస్తారని అంచనా వేశారు వైసీపీ కార్యకర్తలు. కానీ వంశీ విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు ఈ నేతలు. పార్టీ అధిష్టానం కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు.
Also Read : అమెరికా ‘డ్రాప్ బాక్స్’ వీసా నిబంధనలు మరింత కఠినం
ఫార్మాలిటీకి జగన్ జైలుకు వెళ్తున్నారు గాని అధిష్టానం నుంచి సరైన స్పందన లేదనే కామెంట్ ఉంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జగన్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టినా.. ఆ పోస్ట్ కు కూడా పెద్దగా స్పందన లేదు. ఇక గన్నవరం వైసీపీ కార్యకర్తలు కూడా పెద్దగా వంశీ కోసం మద్దతుగా రోడ్లమీదకి వచ్చిన పరిస్థితి లేదనే చెప్పాలి. కనీసం వంశీకి మద్దతుగా సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ కాలేకపోతున్నారు వైసిపి కార్యకర్తలు. అటు వైసిపి నాయకులు కూడా సోషల్ మీడియాలో ఏదో నామమాత్రంగా పోస్టులు పెట్టినా… పెద్దగా వంశీ కోసం బయటికి వచ్చిన పరిస్థితి లేదని చెప్పాలి.
Also Read : బన్నీ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ.. త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చినట్టే..!
వంశీతో సన్నిహితంగా మెలిగే కొడాలి నాని, జోగి రమేష్ ఈ విషయంలో సైలెంట్ గానే ఉండిపోయారు. ఒకప్పుడు కొడాలి నాని పదేపదే మీడియా ముందుకు వచ్చి చిటికెలు వేస్తూ.. వాళ్ళలో ఎవరినైనా టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతుందో అప్పుడు అర్థమవుతుందంటూ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కొడాలి నాని సైలెంట్ గా ఉండిపోయారు. ఇక మీడియాలో మంత్రిగా ఉన్న సమయంలో రెచ్చిపోయిన జోగి రమేశ్.. వంశీని అరెస్టు చేసిన తర్వాత రియాక్ట్ అవడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. కనీసం కృష్ణాజిల్లా నాయకులు కూడా బయటకు రాకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక వంశీని అరెస్టు చేయడంతో టీడీపీ కార్యకర్తలు నాయకులు పండగ చేసుకుంటున్నారు.