Friday, September 12, 2025 05:12 PM
Friday, September 12, 2025 05:12 PM
roots

అసలు హోదా కోసమే ఎందుకు ఇంత గోల..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 నెలలుగా ఒకటే అంశం మీద మాట్లాడుతున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో ప్రతిపక్షంగా గుర్తించాలనే డిమాండ్. ఏపీలో మరే సమస్య లేనట్లుగా వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతగా జగన్ ను గుర్తించాలంటూ తెగ గోల చేస్తున్నారు. ఇక కొందరు నేతలైతే జగన్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోందని పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం ఉందనే నమ్మకం ఉంటుందంటూ విచిత్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఎందుకు అంటే… ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అంటారు. మరి అదే పని అసెంబ్లీకి వచ్చి చేయవచ్చు కదా అంటే.. జవాబు చెప్పలేక సైలెంట్ అవుతున్నారు.

Also Read : మహిళలకు చంద్రబాబు కానుక..!

వాస్తవానికి ఎన్నికల ముందు జగన్ తీరు.. ఎన్నికల తర్వాత జగన్ చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదు. 2019 ఎన్నికల ముందు కూడా తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నా… ఇక్కడే రాజధాని ఉంటుంది అంటూ ఓట్లు అడిగాడు. ఎన్నికల తర్వాత అమరావతిని స్మశానంతో పోల్చారు. మూడు రాజధానులు అంటూ విచిత్రమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొని వచ్చారు జగన్. ఇప్పుడు కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు వై నాట్ 175 అని గొప్పగా చాటింపు వేసుకున్నాడు. అంటే అసలు ప్రతిపక్షమే అవసరం లేదంటూ ఎన్నికల్లో ఓట్లు అడిగాడు జగన్. అంతకు ముందు కూడా అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఓ నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం.. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు ఉండాలని.. అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు హోదా లేకుంటే సభకు రారా అంటే.. వస్తే మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా అంటూ ముందుగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. సభకు మాత్రం రావటం లేదు.

Also Read : తెలంగాణాపై మీనాక్షి గురి.. యాక్ట్ చేస్తే తాట తీస్తాం..!

ఇక వైసీపీ నేతలైతే… సోషల్ మీడియాలో, సభ బయట, ప్రెస్ మీట్ లో జగన్ కు ఇస్తున్న ఎలివేషన్ మామూలుగా ఉండటం లేదు. “మా అన్న పులి.. మా అన్నను చూసి కూటమి సర్కార్ భయపడుతోంది.. అసలు అన్న రేంజ్ ఏంటో తెలుసా.. ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు కూటమికి భయమెందుకు..” అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు. అసలు హోదా లేకుంటే అసెంబ్లీకి రావటానికి ఇబ్బంది ఏమిటి అని ఎవరైనా అడిగితే.. అబ్బే.. ఎస్కార్ట్ వెహికల్ లేకుండా అన్న కాలు బయటపెట్టరు కదా అని అసలు విషయం చెబుతున్నారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. గవర్నర్, స్పీకర్, సీఎం కోసం ప్రత్యేక గేట్ ఉంటుంది. క్యాబినెట్ ర్యాంకు ఉన్న వారికి ఒక మార్గం, ఎమ్మెల్యేలకు మరో దారి ఉంది. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి ప్రత్యేక మార్గం ద్వారా అనుమతి ఉంటుంది. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి అందరితో కలిసి సభలోకి రావాలి. అది జగన్ కు ఏమాత్రం మింగుడు పడిన అంశం. నేనేంటి.. అందరితో కలిసి రావటం ఏమిటనే ఈగో. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ మాదిరిగా.. “నేను వేరులేన్నా..” అనేది జగన్ మాట. ఆ దర్పం కావాలి కాబట్టే ప్రతిపక్ష నేతగా గుర్తించాలి మహా ప్రభో అంటూ తెగ గోల చేస్తున్నారు జగన్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్