Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

ఆ విషయంలో జగన్ భయపడుతున్నారా..?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రజా వేదిక కూల్చివేతతో జగన తన పాలన ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు. వ్యవస్థలను విధ్వంసం చేశారు. ఐదేళ్ల పాటు ఏపీలో జరగని అరాచకం లేదు. చివరికి ప్రజలు నిలదీస్తారనే భయంతో పరదాల చాటున పర్యటనలు చేశారు జగన్. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేశారు. చివరికి వ్యక్తిత్వ హననం కూడా చేశారు. చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలోనే నీచ వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు పవన్ కల్యాణ్‌ గురించి ఏ మాత్రం పట్టించుకోని జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ ప్రస్తావన వస్తే చాలు.. 3 పెళ్లిళ్లు అనేశారు జగన్. కించపరిచేలా పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్ వంటి నేతలకు ప్రత్యేకంగా పవన్ పైన విమర్శలు చేయమని ఆదేశించారు కూడా. దీంతో పవన్ కూడా జగన్‌పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన సవాల్ పెద్ద దుమారం రేపింది కూడా. జగన్ గుర్తు పెట్టుకో అంటూ.. పవన్ చెప్పిన డైలాగ్.. హాట్ టాపిక్‌గా మారింది కూడా.

Also Read : డబ్బు కోసం లైంగిక వీడియోల అమ్మకం.. హైదరాబాద్ జంట అరెస్ట్

చెప్పినట్లుగానే జగన్‌ను పవన్ అధఃపాతాళానికి తొక్కేశారు. వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్.. చివరికి 11 స్థానాలకే పరిమితమయ్యారు. 30 ఏళ్లు సీఎం కుర్చీ తనదే అని గొప్పగా చెప్పుకున్న జగన్.. సరిగ్గా ఐదేళ్లకే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. పవన్ కొట్టిన దెబ్బకు జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే సెటైర్లు వేశారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తు వల్ల తనకే లాభం ఉంటుందని జగన్ భావించారు. అయితే ఓటర్ల తీర్పు మాత్రం మరోలా వచ్చింది. దీంతో తాను చేసిన తప్పును జగన్ తెలుసుకున్నట్లున్నారు. నోరు అదుపు తప్పటం వల్లే తనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని భయపడుతున్నట్లున్నారు. అంతకు ముందు వాడేంత, వీడేంత అన్నట్లుగా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు మాత్రం.. అసలు అలాంటి పదాలే అనటం లేదు. సీఎం కుర్చీలో ఉన్నన్ని రోజులు చంద్రబాబును ముసలోడు, వయసైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక లోకేష్‌ గురించి, పవన్ గురించి కూడా కించపరిచేలా కామెంట్లు చేశారు. ఇవన్నీ ఎన్నికల్లో బూమ్ రాంగ్ అవ్వడంతో.. ఇకపై ఆ విధానం సరికాదని జగన్ భావించినట్లున్నారు. అందుకే ఇటీవల జగన్ ప్రసంగం పూర్తిగా మారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read : బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం

కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన పేరుతో ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటోంది. ఇదే సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై యుద్ధం చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని.. ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వైసీపీ వెబ్ సైట్‌లోని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఓ విషయంలో మాత్రం జగన్‌ భయపడుతున్నారనే మాట వినిపిస్తోంది. కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా భాగస్వామ్యులే. కానీ జగన్ మాత్రం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.

Also Read : విమర్శల దెబ్బకు వెనక్కు తగ్గిన గంభీర్.. టీంలో భారీ మార్పులు

వాస్తవానికి ఎన్నికల సమయంలో కూటమి పార్టీలో ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్ చేశాయి. సుపరిపాలన వేడుకలను కూడా ఉమ్మడిగా నిర్వహించాయి. అయితే జగన్ మాత్రం పవన్ కల్యాణ్‌ను, బీజేపీ నేతలను కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. పవన్ గురించి అయితే అసలు ప్రస్తావించటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కంటే కూడా పవన్‌నే ఎక్కువగా టార్గెట్ చేశారు జగన్. ఆ కారణంగానే ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు తనకు పూర్తిగా దూరమయ్యాయేమో అని జగన్ భావిస్తున్నట్లున్నారు. పవన్ విషయంలో తప్పు చేసినట్లు జగన్‌కు జ్ఞానోదయం అయినట్లుంది. అందుకే కనీసం పవన్ పేరును జగన్ ప్రస్తావించటం లేదు. కేవలం చంద్రబాబు, టీడీపీ అంటున్నారు తప్ప.. పవన్, జనసేన, బీజేపీ, మోదీ అనే మాటలు జగన్ నోటి నుంచి రావటం లేదు. పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. కాబట్టి.. మరోసారి పవన్‌తో పెట్టుకుంటే.. ఈసారి దెబ్బ మామూలుగా ఉండదని జగన్ భయపడుతున్నట్లున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్