Saturday, September 13, 2025 03:11 AM
Saturday, September 13, 2025 03:11 AM
roots

టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?

టిబెటన్ పీఠభూమి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. దీన్ని “ప్రపంచపు పైకప్పు” అని కూడా పిలుస్తారు. దీని సగటు ఎత్తు సుమారు 4,500 మీటర్ల (సుమారు 15,000 అడుగుల) వరకు ఉంటుంది. ఇంత ఎత్తులో విమానయానానికి అనేక సాంకేతిక మరియు భౌగోళిక సమస్యలు ఉంటాయి. అందువల్ల చాలా విమానాలు ఈ ప్రాంతం మీదుగా నేరుగా ఎగరవు. ఎంత అనుభవం ఉన్న పైలట్లకు అయినా ఈ ప్రాంతంలో విమానాలు నడపడం చాలా కష్టసాధ్యం. అసలు ఈ ప్రాంతంలో విమానాలు నడపడం ఎందుకు కష్టంలో ఒకసారి తెలుసుకుందాం..

Also Read : పాకిస్తాన్ లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ

1. తక్కువ వాయు పీడనం:

ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ వాయు పీడనం తగ్గిపోతుంది. తక్కువ పీడనంలో విమాన ఇంజిన్లు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఇది విమాన నౌకా నిబంధనలకూ విరుద్ధం అవుతుంది. పైగా, ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు చేయడం కష్టం. జెట్ ఇంజిన్లకు ఆక్సిజన్ ఎంతో అవసరం. కానీ అధిక ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉండటం వలన, ఇంజిన్లకు తగినంత స్థాయిలో ఆక్సిజన్ లభించదు. ఇది థ్రస్ట్ ను తగ్గిస్తుంది. గాలి సాంద్రత తక్కువగా ఉండటం వలన విమానం రెక్కలు తగినంత లిఫ్ట్ ను ఉత్పత్తి చేయలేవు. దీని వలన విమానం ఎగరడం, నియంత్రించడం చాలా కష్టం అవుతుంది.

2. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలు లేవు:

టిబెటన్ పీఠభూమి పర్వతాలతో నిండివుంది. విమాన భద్రతా నియమాల ప్రకారం సత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ కోసం విమానం ఎల్లప్పుడూ సమీప విమానాశ్రయానికి చేరుకోగలగాలి. అయితే ఈ ప్రాంతంలో సాఫీగా ల్యాండ్ అయ్యే ప్రదేశాలు లేవు. పైగా, మైల్స్ కొద్దీ ఎత్తయిన పర్వతాలు ఉండటంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విమానం దిగి రాలేదు.

Also Read : యూకే రావొద్దు.. భారత మహిళ సంచలన వార్నింగ్

3. వాతావరణ పరిస్థితులు:

ఈ ప్రాంతంలో వాతావరణం అనిశ్చితంగా ఉంటుంది. ఎక్కువగా మంచు, గాలులు, మేఘాల వల్ల వ్యూహాత్మకంగా విమానం నడపడం చాలా కష్టం. పైగా, చిన్నచిన్న మలుపులు వేయడం కుదరదు, ఎందుకంటే పర్వతాలు దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతంలో చాలా బలమైన గాలులు వీస్తాయి. ఇది విమాన ప్రయాణానికి ఎంతో ఆటంకంగా మారుతుంది. ఇక్కడ తరచుగా భారీ మంచు కురుస్తుంది. ఇది ల్యాండింగ్ విజిబిలిటీ తగ్గిస్తుంది. విమాన నావిగేషన్ ను క్లిష్టంగా మారుస్తుంది.

4. నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ సమస్యలు:

అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో సిగ్నల్ ప్రభావం తగ్గిపోతుంది. రేడియో కమ్యూనికేషన్ అంతగా పని చేయదు. దీంతో విమానాలను ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వివరణాత్మక వైమానిక పటాలు లేవు, దీని వలన విమాన ప్రయాణ మార్గాలను ప్లాన్ చేయడం కష్టం అవుతుంది. ఇది విమాన భద్రతకు పెద్ద సమస్య అవుతుంది.

Also Read : విదేశీ బోర్డులపై బీసీసిఐ ఒత్తిడి..? ఐపిఎల్ కోసం బోర్డు సాహసం..?

5. హై అల్టిట్యూడ్ టర్బ్యులెన్స్:

టిబెటన్ పీఠభూమిపై ఎక్కువగా “క్లియర్ ఎయిర్ టర్బ్యులెన్స్” ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరమైన కదలికలు కలిగిస్తుంది. ప్రయాణికులకు, పైలట్‌కు అసౌకర్యం కలిగించడమే కాకుండా ప్రమాదకరంగా మారవచ్చు.

మొత్తంగా టిబెటన్ పీఠభూమి భౌగోళికంగా అత్యంత కఠినమైన ప్రాంతాలలో ఒకటి. పర్యావరణ పరిస్థితులు, సాంకేతిక పరిమితులు మరియు భద్రతా అంశాల దృష్ట్యా విమానయాన సంస్థలు ఈ ప్రాంతం మీదుగా నేరుగా విమానాలు నడపడాన్ని నివారిస్తున్నాయి. ఇది ఒక విధంగా ప్రయాణికుల భద్రతను కాపాడటానికి తీసుకునే జాగ్రత్తగా చెప్పొచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్