Tuesday, October 21, 2025 05:40 AM
Tuesday, October 21, 2025 05:40 AM
roots

అయ్యర్ కు ఏమైంది..? జట్టు నుంచి సడెన్ గా..!

గత కొన్నాళ్ళుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ కు జట్టులో అన్యాయం జరుగుతోంది అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయ్యర్ ను ఆసియా కప్ లో ఎంపిక చేయకపోవడాన్ని అభిమానులు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అయ్యర్ ను ఆస్ట్రేలియాలో ఇండియా ఏ పర్యటనకు కెప్టెన్ గా ఎంపిక చేసారు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అయ్యర్ ను ఎంపిక చేయలేదు. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.

Also Read : ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది..!

ఆస్ట్రేలియా ఏ తో జరగబోయే రెండవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కు కొన్ని గంటల ముందు, ఇండియా ఏ జట్టు నుంచి అయ్యర్ తప్పుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాకుండా, జట్టు నుంచి తప్పుకుని ముంబై చేరుకున్నాడు. దీనితో అతని స్థానంలో కీపర్ ధృవ్ జూరెల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది యాజమాన్యం. అతను ఎందుకు తప్పుకున్నాడు, దీని వెనుక కారణాలు ఏంటీ అనే దానిపై బోర్డు గాని జట్టు యాజమాన్యం గానీ క్లారిటీ ఇవ్వలేదు. వ్యక్తిగత కారణంతోనే అతను తప్పుకుంటున్నాడని సమాచారం.

Also Read : కేసీఆర్ ప్లాన్ అమలు చేయనున్న జగన్..!

తొలి మ్యాచ్ లో అయ్యర్ పెద్దగా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్ లో 8 రెండవ ఇన్నింగ్స్ లో 13 పరుగులు చేసాడు. గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ఇప్పటికే వన్డే క్రికెట్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే మిగిలిన రెండు ఫార్మాట్ లలో మాత్రం అతనికి చోటు కష్టంగా మారింది. కాగా అతనిని విండీస్ పర్యటనకు ఎంపిక చేయవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో విండీస్ పర్యటనకు జట్టు ఎంపిక చేయనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్