Friday, September 12, 2025 05:30 PM
Friday, September 12, 2025 05:30 PM
roots

కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ… హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యేలా పరిస్థితి దిగజారి పోయింది. మేమే గ్రేట్ అని చెప్పుకున్న పార్టీకి చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అసెంబ్లీలో గొంతు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ధైర్యం చేయలేదు. ఇప్పుడు చివరికి జిల్లాల్లో పార్టీని నడిపే నాయకుడే లేని పరిస్థితికి దిగజారి పోయింది. ఇదే తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి. పార్టీ స్థాపించి 25 ఏళ్లు సంబంరం జరుపుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?

ఉద్యమ పార్టీగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి… ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారిపోయింది. 2002లో మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి… నాటి నుంచి అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంది. చివరికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించి… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన మొదటి పార్టీగా రికార్డు కెక్కింది కూడా. ఇక నాటి నుంచి తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలంగాణలో కారు పార్టీ జోరు కొనసాగిందనేది వాస్తవం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదలు… అన్ని ఎన్నికల్లో గులాబి పార్టీ ఘన విజయం సాధించింది. చివరికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేవలం 2 స్థానాలకే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు అదే ఉద్యమ పార్టీ అధికారం కోల్పోయిన ఏడాది లోపే జీహెచ్ఎంసీలో మేయర్ స్థానాన్ని కోల్పోయింది.

Also Read : రేవంత్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌కు బీజేపీనే ఆయుధమా…?

25 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న ప్రస్తుత ఏడాదిలో జిల్లాల్లో కారు పార్టీ స్టీరింగ్ పట్టుకునేందుకు నేతలు కరువయ్యారనేది వాస్తవం. ఎన్నికల తర్వాత పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే పేరుకే నలుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ… పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కనీసం ఒక్క లీడర్ కూడా ముందుకు రావటం లేదు. పార్టీ 25 ఏళ్ల సంబరం గ్రాండ్‌గా చేద్దామని అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపును నేతలెవరూ లెక్క చేయటం లేదు. కనీసం ఆ దిశగా ఇప్పటి వరకు జిల్లాల్లో ఒక్కరు కూడా సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేని పార్టీ అనే చెడ్డ పేరు కూడా మూటగట్టుకోవడంతో… గులాబీ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు కూడా. దీంతో జిల్లాల్లో కారు స్టీరింగ్ పట్టుకునే నేత ఎవరూ అనే ప్రశ్న వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్