గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమాలపై ఇప్పుడు హైడ్రా గట్టిగా దృష్టి సారించింది. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఎవరు అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ దూసుకుపోతున్నారు అధికారులు. ఇప్పుడు ప్రముఖ నేతల అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది హైడ్రా. ఓవైసీ బ్రదర్స్ కు చెందిన అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు. సకలం చెరువు చుట్టూ ఆక్రమణలను హైడ్రా అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో కొన్ని ప్రైవేట్ కట్టడాలను గుర్తించారు. ఒవైసీకి చెందిన విద్యాసంస్థలతో పాటు.. ప్రైవేట్ భవనాలను గుర్తించారు. వాటికి సంబంధించిన పాత్రలను పరిశీలించి, కట్టడాలను కూడా పరిశీలించారు.
అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నామని హైడ్రా పేర్కొంది. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం అని హైడ్రా భావిస్తోంది. విద్యార్థులు రోడ్డున పడ కూడదని మాత్రమే ఆలోచిస్తున్నామని అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాళ్లకు వాళ్లుగా తొలగించక పోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుంది అని హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పినట్టు సమాచారం. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా, కేటీఆర్ అయినా అందరికీ ఒకటే రూల్ అని రంగనాథ్ స్పష్టం చేసారు. చెరువులను, కాల్వలను ఆక్రమించి కట్టిన ఎలాంటి కట్టడమైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచే ఎన్నో వినతులు వస్తున్నాయని, ఆక్రమణల పై వారే సమాచారం ఇస్తున్నారని తెలిపారు.
ఇక ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా ఫోకస్ పెట్టి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారని వీటిని చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నోటీసులు పంపారు. దీనిపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని, కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని లేని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనితో హైడ్రా ఆ భవనాలను కూల్చడం ఖాయం అనే క్లారిటీ వచ్చింది. ఇక జన్వాడ ఫాం హౌస్ మీద కూడా హైడ్రా గురి పెట్టింది. ఫాం హౌస్ లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారని సమాచారం. దీని పై కూడా కొన్ని రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.