విజయవాడకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం విజయవాడ ఉత్సవ్ ప్రారంభించారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సెలబ్రెటీలు విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇక సెలవులు కూడా కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఈవెంట్‌కు వస్తున్నారు. దీంతో గ్రాండ్ సక్సెస్ అంటున్నారు నిర్వాహకులు. ఇక ఇదే జోష్‌లో విజయవాడ ఎక్స్ పో కూడా ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేశారు.
Also Read : గంభీరంగా గర్జించిన ఓజీ.. థియేటర్ లలో సింహగర్జన..!
విజయవాడలోని పున్నమి ఘాట్, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో విజయవాడ ఉత్సవ్ వైభవంగా కొనసాగుతోంది. సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో 11 రోజుల పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ కొనసాగనుంది. ఇదే సమయంలో గొల్లపూడిలోని ఎగ్జిబీషన్ గ్రౌండ్స్‌లో 54 రోజుల పాటు మెగా ఎగ్జిబిషన్ నిర్వహించాలని సోసైటీ సభ్యులు నిర్ణయించారు.
54 రోజుల పాటు విజయవాడ ఎక్స్ పో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో ప్రభుత్వ శాఖలతో పాటు ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య వర్గాలకు ప్రత్యేక స్టాల్స్ కేటాయించారు. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి ఎక్స్ పో ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ.. కొన్ని ఆటంకాల కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఎక్స్ పో తేదీని అధికారికంగా సోసైటీ సభ్యులు ప్రకటించారు.
Also Read : జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!
ఈ నెల 27వ తేదీన గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో విజయవాడ ఎక్స్ పో ప్రారంభం అవుతున్నట్లు సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు తెలిపారు. ఎక్స్ పో ను ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభిస్తారన్నారు. 54 రోజుల పాటు విజయవాడ వాసులకు ఎక్స్ పో అందుబాటులో ఉంటుందన్నారు.