మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం అవుతుందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఆరేళ్లుగా విచారణ ముందుకు జరగటం లేదని వివేకా కుమార్తె డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో రోజు వారీ విచారణ జరిపించాలని కూడా న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తమపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని కూడా పిటిషన్‌లో స్పష్టం చేశారు. హత్య వెనుక కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపించిన సునీత.. ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కూడా అవినాష్‌ను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆరోపించారు సునీత. అయితే జగన్ కంటే ఎక్కువగా ఈ కేసు గురించి ఆలోచిస్తున్న వ్యక్తి మరొకరు ఉన్నారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : బోరుగడ్డ కేసులో కీలక పరిణామం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తొలి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతోంది. ముందుగా గుండె పోటు అన్నారు.. ఆ తర్వాత గొడ్డలి పోటు అన్నారు.. తర్వాత ఈ హత్య వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందంటూ.. నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద స్టోరీ రాశారు. ఆ తర్వాత ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి పాత్ర ఉందన్నారు. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇదంతా 2019 ఎన్నికల ముందు చెప్పిన కథలు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చేశారు. సీబీఐ అవసరం లేదు… ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తే చాలు అన్నారు. ఇక సునీల్ యాదవ్ అప్రూవర్‌గా మారిపోవడంతో.. స్టోరీ మరో మలుపు తిరిగింది. వివేకాకు మరో మహిళతో వివాహమైందని… ఆస్తి పంపకాల్లో తేడా వల్లే సొంత కుమార్తె, అల్లుడు హత్య చేయించారంటూ కొత్త కథ చెప్పారు. అదే సమయంలో ఈ కేసులో విచారణ చేస్తున్న నాటి సీబీఐ అధికారి రాంసింగ్ పైనే ఆరోపణలు చేశారు. చివరికి స్థానిక పోలీసులతో కలిసి సీబీఐ అధికారి రాంసింగ్‌పైనే కేసు నమోదు చేశారు.
Also Read : కన్నీరు పెట్టిస్తున్న అమెరికాలో భారత విద్యార్ధుల దుస్థితి..!
ఇక విచారణకు పూర్తిగా సహకరిస్తామంటూ పైకి చెబుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. తండ్రి అరెస్టు తర్వాత మాట మార్చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అసలు ఈ హత్యతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. అదే సమయంలో సీబీఐ విచారణకు హాజరు కాకుండా కుంటిసాకులతో తప్పించుకుని తిరిగారు. చివరికి అరెస్టు చేస్తారని భయపడిన అవినాష్… తల్లికి ఆరోగ్యం సరిగా లేదని.. అందుకే సొంత ఊరు పోతున్నా అంటూ ఆఘమేఘాల మీద హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చేశారు. తెలంగాణలో ఉంటే అరెస్టు తప్పదనే భయంతోనే కర్నూలుకు వచ్చారనేది బహిరంగ రహస్యం. అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సీబీఐ అధికారులను, తెలంగాణ పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరికి ఎలాంటి అరెస్టులు చేయవద్దంటూ హైకోర్టును ఆర్డర్ వచ్చిన తర్వాతే విచారణకు హాజరయ్యారు అవినాష్. దీంతో తప్పు చేశాడు కాబట్టే అంత భయపడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read : అమెరికా దాటుతున్నారా.. పాస్‌పోర్ట్ జాగ్రత్త..!
ఇక వివేకా హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. కుట్లు వేసిన డాక్టర్, వాచ్‌మెన్.. ఇలా ఇప్పటికే ఆరుగురు మరణించారు. ఆరేళ్లు అయినా దోషులు మాత్రం దొరకటం లేదు. ఇక కోర్టులో విచారణ ప్రారంభయ్యే నాటికి సాక్ష్యులంతా మాయమైపోయేలా ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు మరణించారు. చివరికి “సాక్షులను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ఈ కేసు కొట్టివేయడమైనది.. నిందితులంతా దోషులు కాదు..” అని న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తారేమో. వాస్తవానికి ఇలాంటివన్ని సినిమాల్లోనే కనిపిస్తాయి. కానీ వివేకా హత్య కేసులో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ప్రత్యక్ష సాక్షి మొదలు… అంతా ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. చివరికి ఇదంతా చూస్తుంటే మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితులంతా చనిపోవడంతో… అసలు సూత్రధారి ఎవరనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదు. వివేకా హత్య కేసు కూడా ఇలాగే చేస్తారనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : వాట్సాప్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే ఇటీవల కాలంలో అందరిలో పెద్ద అనుమానం మొదలైంది. అదే గుండెపోటు మాట. వాస్తవానికి వివేకా హత్య జరిగిన విషయాన్ని ముందుగా వైసీపీ అనుకూల మీడియా, అధికార మీడియా బయటపెట్టలేదు. వైసీపీ అధినేత సొంత ఛానల్ సాక్షిలో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీలో బ్రేకింగ్ వచ్చిన తర్వాతే వచ్చింది. అది కూడా ముందుగా గుండెపోటు అని వచ్చింది. వైసీపీలో నాడు నంబర్ టూ పొజిషన్‌లో ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందుగా ప్రకటన చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ సాయిరెడి ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి.. హత్యకు గురైనట్లు మాట మార్చారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. గుండె పోటు విషయం తనకు ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా చెప్పాడని.. అందుకే తాను కూడా గుండెపోటు అనే ప్రకటించానంటూ తప్పంతా అవినాష్‌పైకి నెట్టేశారు. వాస్తవానికి సాయిరెడ్డి కంటే ముందే ఓ కీలక వ్యక్తి.. సాక్షి ఆఫీస్‌కు ఫోన్ చేసి గుండెపోటు అని బ్రేకింగ్ వేయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. అసలు సాక్షి ఛానల్‌కు ఫోన్ చేసి గుండెపోటు బ్రేకింగ్ వేయించింది ఎవరూ… అలా ఎందుకు వేయించారు.. అసలు హత్య జరిగితే.. దానిని గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించాలని చూశారు.. హంతకులను కాపాడేందుకు ఎందుకు అంతగా ప్రయత్నం చేశారనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరూ..?