Saturday, September 13, 2025 07:26 PM
Saturday, September 13, 2025 07:26 PM
roots

నేపాల్ ఉద్యమం.. నష్టం ఎవరికీ..?

యువత తలచుకుంటే.. ఏదైనా సాధ్యమే అనేది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. జెన్ జెడ్‌గా పేర్కొంటున్న నేపాల్ ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్నే కూల్చి వేసింది. హిమాలయ రాజ్యం అనే పేరున్న నేపాల్‌ యువత కారణంగా మంటల్లో చిక్కుకుంది. ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రధాని సహా మంత్రులంతా దేశం వదిలి పారిపోయారు. కేవలం సోషల్ మీడియాపై నిషేధం విధించినందుకే యువత ఉద్యమం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపై ఆందోళనలు జరిగాయి. చివరికి కాల్పుల్లో పదుల దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులు బుగ్గి పాలయ్యాయి. వేల కోట్ల ప్రజాధనం లూటీ అయ్యింది. శాంతికి చిహ్నంగా ఉండే నేపాల్‌లో లూటీలు ఆ దేశానికి కావాల్సినంత చెడ్డపేరు తీసుకువచ్చాయి.

Also Read : రిటైర్మెంట్ ఆలోచనలో మరో ముగ్గురు స్టార్లు

సోషల్ మీడియా కోసమే ఇంత హింస.. ప్రభుత్వాన్ని కూలదోయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తుంటే.. వాటి ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది అంత సమర్థనీయమైన అంశం కాదని కూడా విశ్లేషకుల మాట. యువత ఆగ్రహానికి సోషల్ మీడియా ఒకటే కారణం కాదు అనేది వాస్తవం. కొన్నేళ్లుగా ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేపాల్ ప్రజలు. ఆర్థిక ఇబ్బందులకు తోడు నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలు నేపాల్ ప్రభుత్వంపై యువత ఆగ్రహానికి కారణం.

వాస్తవానికి సోషల్ మీడియా బ్యాన్ అనేది చాలా చిన్న విషయం. అయితే ఈ నిషేధం విధించడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వ పెద్దల అవినీతిపై సోషల్ మీడియాలో చర్చ. మూడు దశాబ్దాలుగా రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలి కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. విధ్వంసం అనంతరం యువత ప్రధాన డిమాండ్లలో కూడా అది ఒకటి. రాజ్యాంగాన్ని తిరగరాసి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలని యువత డిమాండ్ చేస్తోంది. కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. వీటి సాధన కోసం జెడ్ జెడ్ ఎంచుకోవడం సరైంది కాదు అంటున్నారు విశ్లేషకులు.

Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

సోషల్ మీడియాపై నిషేధం… భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే కావచ్చు… కానీ ఇందుకోసం శాంతియుతంగా ఉద్యమాలు చేసి సాధించుకోవాలి. అంతే కానీ ఇలా హింసాత్మకంగా మరితే.. ఆస్తికి నష్టం కలిగిస్తే.. దాని వల్ల ఎవరికి నష్టం. ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు అక్కడి యువత. చివరికి విదేశీయులంతా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. దీని వల్ల పర్యాటక రంగం పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది.

నేపాల్‌లో 2008లో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. ఇంటరి్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్‌ ద్వారా రాచరిక వ్యవస్థను తొలగించారు. 2015 సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయి రాజ్యాంగం అమలవుతోంది. పదేళ్లలోనే రాజ్యాంగంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత రావడం పెద్ద ఎత్తున ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మార్పులు చేర్పులు సహజం. అంతే కానీ.. ఇలా హింసాత్మక చర్యలు చేపట్టడం.. ఆ దేశ ఆర్థిక మనుగడకే ప్రమాదం. నేపాల్ యువత ఉద్యమంలో ఆవేశం తప్ప వివేచన కనిపించడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్