Monday, March 9, 2026 03:10 PM
Monday, March 9, 2026 03:10 PM

ఆ నలుగురితోనే ప్రమాదం..!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నది ఎవరు..? అసలు పార్టీ అధ్యక్షుడు ఎవరు..? పార్టీని నడిపిస్తున్నది ఎవరు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీడీపీ సీనియర్, జూనియర్ నేతలను బాగా కలవరపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనేది వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చెప్పిన మాట. ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాటను ఇప్పటికీ పదే పదే చెబుతున్నారు. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ అని.. కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడిన పార్టీ అనేది చంద్రబాబు మాట. కానీ ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం.. కార్యకర్తలకే కాదు.. నాయకులు కూడా మధ్యలో వీళ్లేవరు అని అనుమానం కలుగుతోంది.

Also Read : వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..!

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కాదు.. ఏపీ రాజకీయాల్లో కూడా అత్యంత కీలకమైన నేతగా, బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మంత్రి నారా లోకేష్. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి కార్యకర్త క్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కార్యకర్తకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే.. ఎంత పెద్ద కష్టమైనా సరే.. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు. చివరికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా.. కష్టంలో ఉన్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే.. వెంటనే ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అంటున్నారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఓ నలుగురు వ్యక్తుల కారణంగా లోకేష్‌తో పాటు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్.

మహాభారతంలో దుష్ట చతుష్టయం అనే మాట ఉంటుంది. మాయాబజార్ సినిమాలో దుర్యోధనుడు, దుశ్యాసనుడు, కర్ణుడు, శకునిని ఉద్దేశించి ఘటోత్కచుడు చెప్పే మాట ఇది. ఈ నలుగురి వల్లే కురు వంశం పతనమైంది అనేది ఆ మాట సారాంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాగే చతుష్టయం పేరుతో ఓ నలుగురు మంత్రి లోకేష్ చుట్టూ చేరినట్లు పార్టీలో బాగా వినిపిస్తోంది. నిజానికి లోకేష్ చుట్టూ చేరిన వారి వల్లే ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ప్రధానంగా ఓ నలుగురి వ్యక్తుల వల్ల లోకేష్‌కు కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ మిత్రద్వయంలో టీడీపీ పట్ల అభిమానం కంటే కూడా.. ధన దాహం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.

Also Read : ఆఫ్ ది రికార్డు.. ఇంతకూ ఆయన మతమేంటి..?

ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో కూడా ఈ నలుగురు చెప్పినట్లే జరగాలి అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఢిల్లీలో వ్యవహారాల కోసం ఇద్దరు, పార్టీలో తానే ఫైనల్ అనేందుకు ఒకరు, ప్రభుత్వంలో తన మాటే శాసనం అని మరొకరు అంటున్నారని లోకేష్‌ను దగ్గరగా చూస్తున్న వాళ్లు చెబుతున్నారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ నలుగురిలో పార్టీ పట్ల అభిమానం, లోకేష్ పట్ల విధేయత కనిపించటం లేదంట. ఇలాంటి వారినే మంత్రి లోకేష్ ఎలా నమ్మారని సచివాలయంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న సీనియర్ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా ఆ చతుష్టయంను పక్కన పెట్టకపోతే.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు, చెడ్డపేరు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లక్ష్మీ దుర్గ ఎక్కడ.....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు...

పుకార్లకు బ్రేక్ వేసేది...

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఇంకా...

చంద్రబాబు ఖాతాలో మరో...

పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ సిఎం...

బ్రేకింగ్: బెజవాడ బస్టాండ్...

బెజవాడ బస్టాండ్.. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్....

ఫైనల్ మ్యాచ్‌కు జగన్.....

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్...

కేతిరెడ్డి అరెస్ట్ కు...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద...

పోల్స్