జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి విషయంలో సీరియస్ గా ఉన్న కేంద్రం.. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. వైమానిక దళాలు.. నేడు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో దాదాపుగా వంద మంది ఉగ్రవాదులు హతమయినట్లు వార్తలు వచ్చాయి. ఇక భారత చరిత్రలో తొలిసారిగా, ఇద్దరు మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చి.. జరిగిన దాడులపై మీడియాకు వివరించారు. భారత సైన్యం నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళం నుండి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. మిలటరీ ఆపరేషన్.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి ఏర్పాటు చేసిన అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు.
Also Read : 1971 తర్వాత తొలిసారి.. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు చుక్కలు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక విదేశీ పర్యాటకుడు సహా 26 మంది మరణించిన తర్వాత భారత ఆర్మీ.. ప్రతీకార దాడులకు దిగింది. ఇక ఇద్దరు మహిళా అధికారుల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఎవరు అనే దానిపై జనాలు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషి (Sofiya Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Vyomika Singh) గురించి ఆసక్తికర విషయాలు చూస్తే..
Also Read : ఆపరేషన్ సిందూర్ కు జై కొట్టిన అగ్ర దేశాలు
2016లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఫోర్స్ 18లో కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి, ASEAN ప్లస్ మల్టీ నేషనల్ ట్రైనింగ్ ఈవెంట్ కు ఇండియన్ ఆర్మీకి నాయకత్వం వహించిన మొదటి మొదటి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు. 35 ఏళ్ల వయసులోనే ఆమె ఈ చరిత్ర సృష్టించారు. ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్ లో పాల్గొన్న అన్ని దేశాలలో ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ ఆమె మాత్రమే. ఈరోజు, ఆపరేషన్ సిందూర్ గురించి ఆమె మీడియాకు వివరించారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?
ఇక 1990 కమిషన్డ్ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి విషయానికి వస్తే.. మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలందించారు. ఆమెది రాజీ లేని వైఖరిగా చెప్తారు. దాడులు చేసే విషయంలో ఆమె వెనకడుగు వేయరు అనే పేరు కూడా ఉంది. ఉన్నత స్థాయి పోస్టింగ్‌లు కూడా ఆమె తన పదవీ కాలంలో నిర్వహించారు. 2006లో కాంగో శాంతి పరిరక్షక మిషన్‌కు ఆమె సహకారం చరిత్రలో నిలిచిపోయింది. ముఖ్యంగా ప్రపంచ వేదికపై ఆమె నాయకత్వం భారత్ గర్వపడేలా చేసింది. 2004లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపి సంచలనం సృష్టించారు. 2017 లో వింగ్ కమాండర్ హోదాకు పదోన్నతి పొందిన ఆమె.. ఎయిర్ ఫోర్స్ లో సమర్ధవంతమైన మహిళా అధికారిగా పేరు సంపాదించారు.