ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ.. కొందరు పోలీసుల తీరు ఏ మాత్రం మారలేదు. ఇది ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికే గత ప్రభుత్వ పెద్దలకే భజన చేస్తున్నారు కొందరు పోలీసులు. ఇక మరికొందరైతే.. సైలెంట్‌గా సమాచారం చేరవేస్తున్నారు. ఇక ప్రభుత్వం కేసులు పెట్టినా సరే.. వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులే.. దొంగలకు సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో దొంగ పోలీసు దోస్తీ నడుస్తుందా అనే మాట చాలా చోట్ల వినిపిస్తోంది. కొందరు అధికారులు, పోలీసుల తీరు వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Also Read : అందరి పేర్లు రాసిపెట్టుకోండి..జగన్ 2.0లో తేలుస్తా..!
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కొందరు పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. మంత్రులే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఇక ప్రజా ప్రతినిధుల సోదరులు అయితే పెత్తనం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి నేతలపై దాడులకు తెగబడ్డారు. అలాంటి వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పిన్నెల్లి బ్రదర్స్. మాచర్ల నియోజకవర్గంలో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించారు. ఎంత దారుణం అంటే.. నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులపై హత్యాయత్నం కూడా చేయించారు. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే మొత్తం 31 వార్డుల్లో కూడా కనీసం ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. ఎవరైనా వస్తే.. చంపేస్తా అంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అలియాస్ చిన్నోడు బహిరంగంగానే బెదిరించాడు. దీంతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఎవరూ సాహసం చేయలేదు.
Also Read : ఏపీ భవిష్యత్తు నిర్మిస్తున్నాం.. లోకేష్ ఆసక్తికర కామెంట్స్
అయితే ఎన్నికల తర్వాత పిన్నెల్లి బ్రదర్స్‌పై కూటమి సర్కార్ కేసులు పెట్టింది. దీంతో సోదరులిద్దరు పారిపోయారు. కొద్ది రోజులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. హౌస్ అరెస్టులో ఉన్న నేత ఎలా పారిపోయాడు అంటే.. పోలీసుల నుంచి నో ఆన్సర్. పోనీ 11 నెలలుగా ఆచూకీ దొరకలేదా అంటే.. సైలెన్స్. తెలంగాణలో ఉంటున్నట్లు దాదాపు అందరికీ తెలుసు. అక్కడి నుంచే వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడు కూడా. చివరికి అన్న పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని సరదాగా పార్టీ చేసుకుని పరారయ్యాడు. అయినా సరే.. పోలీసులకు మాత్రం పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు.
Also Read : ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?
ఇక మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆచూకీ కూడా ప్రస్తుతం తెలియటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు క్వార్జ్ట్ మైనింగ్ ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా చేస్తోంది. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారంటూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు… కాకాణికి షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో కాకాణి సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. దాదాపు 2 నెలలుగా కాకాణి ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. కానీ కాకాణి మాత్రం తన కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ సంభాషణలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే.. పోలీసులు మాత్రం కాకాణి మిస్సింగ్ అనే చెబుతున్నారు.
Also Read : ధనుంజయ రెడ్డి అరెస్ట్..? ఎంటర్ అయిన ఈడీ..?
ప్రధానంగా కొందరు పోలీసులే నిందితులకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అరెస్టు తర్వాత ఏ మార్గంలో వస్తున్నారో అనే విషయాన్ని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కొందరు పోలీసులే తెలిపారు. అందుకే చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించిన ప్రభుత్వం 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయినా సరే.. వైసీపీ అనుకూల పోలీసుల తీరులో మాత్రం ఇప్పటికీ మార్పు రాలేదు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం.. కూటమి సర్కార్ మూల్యం చెల్లించక తప్పదు.