Wednesday, February 4, 2026 04:09 PM
Wednesday, February 4, 2026 04:09 PM

సింధూ నది ఒప్పందం రద్దైతే పాక్ లో ఏం జరుగబోతోంది..?

భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో సింధు నది వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ ఒప్పందంగా ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం సంచలనం అయింది. అంతర్జాతీయ జల ఒప్పందాలను ఓ దేశం రద్దు చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కాని ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు సమర్ధిస్తున్నాయి. రెండు దేశాల మధ్య 1960 నుంచి నేటి వరకు మూడు యుద్దాలు జరగగా.. ఏ యుద్ధం కూడా ఈ ఒప్పందంపై ప్రభావం చూపలేదు.

Also Read : నీళ్ళు ఆపితే యుద్ధానికి సిద్ధమంటున్న పాక్.. సైన్యానికి సెలవులు రద్దు

గత మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన అనంతరం.. పాక్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై భారతదేశానికి ప్రత్యేక నియంత్రణ లభిస్తుంది. ఇక పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు ఇచ్చారు. అవి జమ్మూ కాశ్మీర్‌లోని భారత భూభాగంలో ప్రాణం పోసుకున్నప్పటికీ.. పాకిస్తాన్ కు 80 శాతం జలాలు కేటాయించారు.

Also Read : బెజవాడలో ఉగ్ర కదలికలు.. దక్షిణాదిపై ఫోకస్..?

ఒకవేళ భారత్ పట్టుదల ప్రకారం.. సింధూ నదీ జలాలను పాకిస్తాన్ వెళ్ళకుండా అడ్డుకుంటే.. ఆ దేశం ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నీటిపారుదలలో దాదాపు 90 శాతం సింధు పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటిపై ఆధారపడి ఉంటుంది. పశ్చిమ నదుల నుండి నీటి సరఫరాలో ఏదైనా అంతరాయం కలిగినా.. పాక్ ఇబ్బందులు పడుతుంది. ఆ దేశ సాగు నీటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పంట దిగుబడి తగ్గడమే కాకుండా.. దేశంలో అశాంతికి కారణం అవుతుంది. ఇక ఆ దేశంలో పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో నీటి కొరత తీవ్రంగా ఉంది.

Also Read : పాపం జగన్.. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా..!

ఇక దేశ విద్యుత్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఉన్న సరైన జలవనరులు లేక.. పాకిస్తాన్ ఏటా దాదాపు 19 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటుండగా, బొగ్గు దిగుమతుల ఆర్థిక భారం 2021 నాటికి 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే అప్పులతో సతమవుతున్న ఆ దేశం ఈ నిర్ణయం గనుక పూర్తి స్థాయిలో అమలు జరిగితే మాత్రం.. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్