Friday, August 29, 2025 06:49 PM
Friday, August 29, 2025 06:49 PM
roots

ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనేది ప్రతి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన మాట. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ 60 ఏళ్ల క్రితమే ఆందోళన మొదలైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆంధ్రుల పోరాటం కొనసాగింది. నియంత పాలన సాగించిన ఇందిరాగాంధీతో పోరాడి.. ఒప్పించి విశాఖలో స్టీల్ ప్లాంట్‌ను సాధించారు. విశాఖ ఉక్కు ఉద్యమం సమయంలోనే ఎంతో మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా ఒకరు. విశాఖ ఉక్కు ఉద్యమం తర్వాతే ఆయన రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది కేవలం విశాఖ ఉక్కు మాత్రమే.

Also Read : 46 ఏళ్ళ తర్వాత వృద్ధ స్టార్ హీరోల మల్టీ స్టారర్..!

తొలి నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం చిన్నచూపు చూస్తున్న మాట వాస్తవం. ఇప్పటి వరక విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా ఒక్క గని కూడా లేదు. అంతా బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిందే. దీంతో సంస్థపై అదనపు ఆర్థిక భారం పడింది. పేరుకే స్టీల్ ఉత్పత్తి సంస్థ అయినప్పటికీ.. సొంత ప్లాంట్ లేకపోవడంతో.. ఆర్థికంగా నష్టాలు చవిచూసింది. అయితే ఉద్యోగులు, కార్మికుల కష్టం పలితంగా స్టీల్ ప్లాంట్‌కు లాభాలు వచ్చాయి. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్‌కు సొంత గని లేదు. కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా సరే.. కేంద్ర పెద్దలు మాత్రం ససేమిరా అంటున్నారు.

ఇక గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కార్మికులతో పాటు ఉత్తరాంధ్ర వాసులు భగ్గుమన్నారు. నాటి కేంద్ర ప్రభుత్వంపైన, జగన్ సర్కార్ తీరుపైన తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు కూడా. దీంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేది లేదన్న కేంద్రం.. అందులోని 32 విభాగాలను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ఆహ్వానించడం వివాదాస్పదమవుతోంది. దీంతో ఒక్కసారిగా కార్మికుల్లో ఆందోళన మొదలైంది. కూటమి సర్కార్ ‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు అంటూ వైసీపీ అనుకూల మీడియా వరుస కధనాలు కూడా ప్రచురిస్తోంది. ఇక సోషల్ మీడియాలో సరే సరి. బాబు, పవన్ హామీలు గాలిలో మూటలు అంటూ పోస్టులు పెడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేది వైసీపీ నేతల డిమాండ్.

Also Read : వివేకా కేసులో సుప్రీం సంచలన నిర్ణయం..!

అయితే ఇక్కడే అందరిలో ఓ అనుమానం తలెత్తింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కావటం లేదు. స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాల ప్రైవేటీకరణ కోసం కేంద్రం టెండర్లు పిలిచినప్పటికీ.. అది తప్పు అంటూ ఎక్కడా వైసీపీ అధినేత అధికారికంగా ప్రకటించలేదు. ప్రైవేటీకరణ ప్రక్రియ అడ్డుకుంటామని వైసీపీ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కిందిస్థాయి నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తప్ప.. పార్టీ అధినేత, అగ్రనేతలు మాత్రం నోరెత్తటం లేదు. పైగా ఉప రాష్ట్రపతి ఎన్నికకు బేషరతుగా మద్దతు ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంటే కేంద్ర పెద్దలకు ఎదురు చెప్పే ధైర్యం జగన్‌కు లేదా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. తనపై ఉన్న కేసుల గురించి జగన్ భయపడుతున్నారని.. అందుకే కేంద్రానికి జగన్ ఎదురు చెప్పడం లేదనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్