Friday, September 12, 2025 02:58 PM
Friday, September 12, 2025 02:58 PM
roots

వైసీపీని ముందుకు నడిపించేదెవరు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటీ.. వైసీపీని ముందుకు నడిపించే నేత ఎవరూ.. అసలు వైసీపీకి భవిష్యత్తు నేత ఉన్నారా.. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి వైసీపీ నేతను, కార్యకర్తను వేధిస్తున్నాయి. అసలు వైసీపీకి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు కదా.. మరి నడిపించే నేత ఎవరు అనే ప్రశ్న ఎందుకు అని ప్రతి ఒక్కరు అనుమానిస్తున్నారు. నిజమే.. ప్రస్తుతం వైసీపీని సర్వం తానే అన్నట్లుగా జగన్ నడిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. మరో మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయి.. అప్పుడు మళ్లీ వైసీపీ గెలుస్తుంది.. అప్పుడు మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతాను అని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెబుతున్నారు. దీంతో జగన్ ఎక్కడికి వెళ్లినా సరే.. అభిమానులు సీఎం సీఎం అని కేకలు వేస్తున్నారు. చివరికి శవం దగ్గర పరామర్శకు వెళ్లినా కూడా సీఎం సీఎం అనే అరుస్తున్నారు.

Also Read : పోలవరంపై తొలిసారి రంగంలోకి మోడీ

వైసీపీని నడిపించే నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అంతా బలంగా నమ్ముతున్నారు. కానీ ఇక్కడే మరో ప్రశ్న ప్రతి వైసీపీ కార్యకర్తను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు.. ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేశారు కూడా. రాజ్ కేసిరెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరంతా జగన్‌కు అత్యంత సన్నిహితులు. భారతీ సిమెంట్ సంస్థలో బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్. జగన్ ఓఎస్‌డీగా కృష్ణమోహన్ రెడ్డి పని చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన షాడో సీఎం మాదిరిగా వ్యవహరించారు.

Also Read : ఎందుకీ మౌనం.. సైలెంట్ అయిపోయిన వైసీపీ సోషల్ మీడియా

లిక్కర్ స్కామ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొనుగోళ్లు కేవలం నగదు రూపంలోనే జరిగినట్లు తేల్చేశారు. దీని వెనుక వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగుతుంటే.. డొంకంతా కదులుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తొలి నుంచి ఆరోపిస్తున్నట్లుగా.. లిక్కర్ స్కామ్ మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నట్లు దాదాపు ఖరారైంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో నెక్ట్స్ ఎవరూ అనే ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : సాయి రెడ్డి బంధువులే కీ రోల్.. లిక్కర్ స్కాంలో మరో సెన్సేషన్

ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమంటున్నారు కూటమి నేతలు. వేల కోట్ల స్కామ్ చేశారు కాబట్టే జగన్ ఏపీ నుంచి బెంగళూరుకు మకాం మార్చేసినట్లు ఆరోపిస్తున్నారు. అరెస్టు భయంతోనే లిక్కర్ స్కామ్‌ పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు కూటమి నేతలు. అయితే వైసీపీ నేతల్లో మాత్రం ఒక భయం పట్టుకుంది. జగన్‌ అరెస్టు ఖాయమని సొంత పార్టీ నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అరెస్టు తర్వాత పరిస్థితుల గురించే ఇప్పుడు వైసీపీ నేతలు భయపడుతున్నారు. వాస్తవానికి జైలుకు వెళ్లడం జగన్‌కు కొత్తేమి కాదు. 2012లోనే అక్రమాస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అప్పుడు 16 నెలల పాటు హైదరాబాద్ చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. అయితే ఆ సమయంలో జైలు నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించారు.

Also Read : హంసపాల్ బదిలీ వెనుక ఇంత కథ ఉందా..?

2012లో జగన్ అరెస్టైన సమయంలో కుటుంబం మొత్తం ఆ రోజు అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు వైఎస్ షర్మిల, భార్య భారతీ రెడ్డితో పాటు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా జగన్‌కు మద్దతు తెలిపారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కోసం షర్మీల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంల ఏకంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఒకరకంగా పార్టీని కాపాడుకున్నారు. ప్రజల్లో సానుభూతి తీసుకువచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తి విరుద్ధం. జగన్‌కు సొంత కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్నారు. ఆస్తుల వివాదం కారణంగా తల్లి, చెల్లి దూరమయ్యారు. సొంత బాబాయ్‌ని హత్య చేయించారనే ఆరోపణలున్నాయి. హత్య కేసులో నిందితుల అరెస్టు కోసం మరో సోదరి డా. వైఎస్ సునీత రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక నాడు జగన్ వెంట తిరిగిన వైఎస్ వీరాభిమానులు ఇప్పుడు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో అందరి దృష్టి భారతీ రెడ్డిపై మాత్రమే ఉంది.

Also Read : వందేళ్ల పండుగకు పసందైన విందు..!

జగన్ అరెస్టు అయితే.. భారతీ రెడ్డి పార్టీ పగ్గాలు చేపడతారా.. పార్టీని ముందుండి నడిపిస్తారా.. మిగిలిన కుటుంబ సభ్యుల అండ లేకుండా ఒక్క భారతీ రెడ్డికి పార్టీని నడిపించే సామర్థ్యం ఉందా.. ఇవే ఇప్పుడు వైసీపీ నేతల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. నాడు విజయసాయిరెడ్డి వంటి నేతల అండతో పార్టీ ముందుకు సాగింది. కానీ ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిపై నేతలు, కార్యకర్తలే గుర్రుగా ఉన్నారు. మరి అలాంటి సజ్జల అండతో వైసీపీని భారతీరెడ్డి ముందుకు తీసుకెళ్లగలరా.. ఈ ప్రశ్నలకు భవిష్యత్తులో జవాబు దొరుకుతుందో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్