Friday, September 12, 2025 10:54 PM
Friday, September 12, 2025 10:54 PM
roots

‘సీఎం ఫెలోస్’.. ఏంటి.. ఎలా పనిచేస్తుంది?

ఐప్యాక్‌ వందల కోట్లు ఫీజులు తీసుకొని జగన్‌కి ‘శాస్త్రీయంగా శల్యసారధ్యం’ చేస్తూ ప్యాకప్ చేయించింది. ఓ పార్టీ ఎన్నికలలో గెలవాలంటే కుట్రలు, కుతంత్రాలు అమలుచేస్తూ, ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయడమే సరికొత్త విధానం అన్నట్లు అది పనిచేసేది. వందల కోట్లు ఫీజు తీసుకున్నా ప్రభుత్వం పనితీరు ఏ విదంగా ఉంది.. లోపాలు, వైఫ్యల్యాలు ఏమిటి.. వాటిని ఏ విదంగా సరిదిద్దుకోవచ్చు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏమిటి.. అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు.. అనే ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పలేదు.

Also Read : ఒక్కొక్కడి అంతు చూస్తా.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

చివరి నిమిషం వరకు నిజాలు తెలియనివ్వకుండా ఉండటం వల్లనే జగన్‌ 175కి 175 సీట్లు మనకే అనే గుడ్డి నమ్మకంతో బోర్లా పడ్డారు. వైసీపీ చేసిన తప్పునా నుంచి పాఠం నేర్చుకుని శాసనసభ ఎన్నికలలో టీడీపీ వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ సూచన మేరకు సిఎం చంద్రబాబు నాయుడు ‘సిఎం ఫెలోస్’ అనే ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సీఎం ఆఫీస్ తో అనుసంధానమై పని చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజల సంతృప్తి, అసంతృప్తి స్థాయిలు తెలుసుకుంటూ.. పరిష్కారాలు సూచిస్తూ ఎప్పటికప్పుడు నేరుగా సీఎం కి రిపోర్ట్ చేయటం వాళ్ళ విధి.

దేశంలో ఐఐఎం, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చిన మెరికల్లాంటి యువతతో ఈ టీమ్‌ ఏర్పాటు కాబోతోంది. రాబిన్ శర్మ టీమ్‌లో పనిచేసిన అనంత్ తివారీ ఆధ్వర్యంలో ఒక్కో జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 25 మందితో ఈ ‘సీఎం ఫెలోస్’ టీమ్‌ ఏర్పాటు కాబోతోంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుంది. దీనిలో పని చేసేవారికి ప్రభుత్వం ఆకర్షణీయమైన జీతభత్యాలు చెల్లిస్తుంది. ఇప్పటికే ఈ టీమ్‌ ఎంపిక మొదలైంది. అది పూర్తవగానే శిక్షణా కార్యక్రమ నిర్వహించి బాధ్యతలు అప్పగిస్తుంది. ఇది 2025 ఏప్రిల్ నుంచి పనిచేయడం ప్రారంభించబోతోంది.

Also Read :పెండింగ్ బిల్లుల పైనే ఫోకస్.. బాబు ప్లానింగ్ ఇదే..!

సీఎం ఫెలోస్ బాధ్యతలు ఏంటంటే:

ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉంది.? ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలున్నాయి? ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? జిల్లాల వారీగా చేపట్టాల్సిన పనులు, ప్రాధాన్యతలు వంటి సమాచారం సేకరించడం. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు వీటన్నిటి గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ, నేరుగా సిఎం చంద్రబాబు నాయుడుకి నివేదించడం. ఆ తర్వాత ఫాలో అప్‌ చేస్తుండటం. ఆశయం మంచిదే అయినా ఆచరణలో లోపముంటే బలమే బలహీనతగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ బృందం పార్టీకి బలంగా మారుతుందో.. బరువుగా మారుతుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్