Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

టీడీపీ సీనియర్లకు ఏమైంది….?

తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సీనియర్లు మాత్రమే. పార్టీ స్థాపించిన నాటి నుంచి… ఉన్న నేతలు ఇప్పటికీ కొనసాగుతున్నారు. తమకు ఎన్టీఆర్ అవకాశం ఇవ్వటం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి నేతలు ఇప్పటికి గర్వంగా చెప్పుకుంటారు. అయితే పార్టీ గెలిచిన తర్వాత సీనియర్‌ నేతలు దాదాపు సైలెంట్‌గా ఉన్నారనేది వాస్తవం. సీనియర్ల మౌనం వెనుక కారణమేమిటీ అనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.

పార్టీలో కిమిడి కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్, యరపతినేని శ్రీనివాసరావు, దూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు దాదాపు 30 ఏళ్లు పైగానే టీడీపీలో ఉన్నారు. వీరితో పాటు పితాని సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి నేతలు కూడా రాజకీయాల్లో సీనియర్లు. వీళ్లంతా ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియటం లేదంటున్నారు టీడీపీనేతలు.

Also Read : టీడీపీ, జనసేన నేతల మధ్య సీటు పాట్లు…!

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయ్యింది. దీనిపై వారం రోజుల పాటు సంబరాలు కూడా జరిపారు. అదే సమయంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. వీటికి తోడు విజయవాడ వరదలు… రాజకీయంగా ఇన్ని డెవలెప్‌మెంట్లు ఉన్నప్పటికీ… సీనియర్లు ఎవరు కనీసం స్పందించటం లేదు. పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఏదో ప్రెస్‌తో ఓ మాట అంటున్నారు తప్ప… ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇందుకు ప్రధాన కారణం… సీనియర్లకు పార్టీలో తగిన గుర్తింపు లేదనే మాట వినిపిస్తోంది.

యనమల, శివాజీ, అశోక్ గజపతిరాజు, జేసీ దివాకర్ రెడ్డికి బదులుగా వారి వారసులు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇక సీనియర్ల కోటాలో గోరంట్ల, యరపతినేని, దూళిపాళ్ల, సోమిరెడ్డి, కన్నా, పితాని వంటి నేతలు మంత్రి పదవులు ఆశించారు. అయితే ఈసారికి అవకాశం లేదని చంద్రబాబు తేల్చిచెప్పటంతో చేసేది లేక సైలెంట్ అయ్యారు. సీనియర్లను పార్టీలో కీలక పదవులిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం… తమకు అధికార పదవులు కావాలని సన్నిహితుల చెబుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపిస్తారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్